ఆ రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం వరకు 1 నుండి 8 తరగతులకు స్కూల్స్ బంద్

Madhya Pradesh Govt Decide To Close Schools For Class 1 To 8 Till March 31,Madhya Pradesh School News,Madhya Pradesh School Close,Madhya Pradesh School,Madhya Pradesh School Closing Date,Madhya Pradesh School News Today,Madhya Pradesh School Reopen News,MP College News,Madhya Pradesh School Closed,Madhya Pradesh School Closed Till 31 March,Madhya Pradesh News Live,MP Schools For Classes 1-8 To Remain Closed Till March 31 Due To COVID,Madhya Pradesh Government,MP Government Cancels Classes For Students From 1 To 8 Till March 31,Madhya Pradesh Schools Latest News,Mango News,Mango News Telugu,Madhya Pradesh Schools

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై మధ్యప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో పాఠశాలలు మార్చి 31 వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. శుక్రవారం నాడు పాఠశాల విద్యా శాఖపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కేవలం 10,12 విద్యార్థులకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

అలాగే వారికీ బోర్డు పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ఏప్రిల్ 1, 2021 న ప్రారంభమవుతుందని చెప్పారు. 1 నుండి 8 వ తరగతి వరకు ఎలాంటి పరీక్షలు ఉండవని, ఆన్ లైన్ తరగతుల ఆధారంగా వారు చేసిన ప్రాజెక్టు వర్కులను బట్టి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు 9 మరియు 11 తరగతుల విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =