శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ.. వెయ్యి కోట్ల భూ కుంభకోణంలో చర్యలు

Maharashtra ED Arrests Shiv Sena MP Sanjay Raut in Rs 1034 Cr Patra Chawl Land Scam Case, ED Arrests Shiv Sena MP Sanjay Raut in Rs 1034 Cr Patra Chawl Land Scam Case, ED Arrested Shiv Sena MP Sanjay Raut in Rs 1034 Cr Patra Chawl Land Scam Case, Firebrand Shiv Sena leader and four-time Rajya Sabha member Sanjay Raut arrested by the Enforcement Directorate, ED has arrested Shiv Sena MP Sanjay Raut who is accused of Rs 1034 crore Patra Chawl Land Scam, Enforcement Directorate, ED arrests Sanjay Raut, Patra Chawl land scam, Rajya Sabha member Sanjay Raut arrested, Shiv Sena MP Sanjay Raut, MP Sanjay Raut, Shiv Sena MP, Sanjay Raut, Patra Chawl Land Scam Case News, Patra Chawl Land Scam Case Latest News, Patra Chawl Land Scam Case Latest Updates, Patra Chawl Land Scam Case Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజా మాజీ సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్‌ భూ కుంభకోణానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి గత నెల (జూలై) 1న సంజయ్‌ రౌత్‌ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తదుపరి విచారణకు రావాలంటూ ఆయనకు ఈడీ అధికారులు రెండు సార్లు సమన్లు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో గత నెల 27న సమన్లు పంపగా, పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రాలేనని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ సంజయ్‌ రౌత్‌ ఇంటి (మైత్రి)కి చేరుకున్నారు. సోదాల సందర్భంగా రౌత్‌ ఇంటిలో రూ. 11.50 లక్షల లభించాయని, దీనిని సీజ్‌ చేసినట్లు ప్రకటించింది. అయితే దీనిపై సంజయ్‌ రౌత్‌ను ప్రశ్నించగా రూ. 10 లక్షలు పార్టీకి సంబంధించినవని, రూ. 1.50 లక్షలు తన ఇంటి మరమ్మతులకు ఉద్దేశించినవని ఆయన వివరించారని ఈడీ వెల్లడించింది. దాదాపు 10 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇక ఈ కేసులోనే ఏప్రిల్‌ నెలలో సంజయ్‌ సతీమణి వర్ష రౌత్‌ సహా ఆయన ఇద్దరు సన్నిహితులు సుజిత్‌ పట్కర్‌, ప్రవీణ్‌ రౌత్‌లకు సంబంధించిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈడీ కార్యాలయం వద్ద సంజయ్ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. వారు (ఈడీ) నన్ను అరెస్టు చేయబోతున్నారు, అయినా తాను వెనుకడుగు వేయనని అన్నారు. ప్రాణాలు పోయినా తలొగ్గేది లేదని, శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు. బాలాసాహెబ్‌ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, నిర్దోషినని, కేసులో అన్యాయంగా ఇరికించారని అన్నారు. ఇక శివసేన, మహారాష్ట్రలను బలహీనపరిచేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని, దీనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈడీ చర్యకు వ్యతిరేకంగా రాష్ట్రంలో శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. పలువురు పార్టీ నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =