పంజాబ్ లో ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ

Major Lapse in Prime Minister Narendra Modi’s Security, Major Lapse in Prime Minister Narendra Modi’s Security in Punjab, Mango News, Modi’s Ferozepur Rally, PM Modi Cancels Ferozepur Visit, PM Modi cancels Ferozepur visit after major security breach, PM Modi Cancels Ferozepur Visit Amid Security Lapses, PM Modi Cancels Ferozepur Visit Amid Security Lapses Says MHA, PM Modi cancels visit to Punjabs Ferozepur amid major lapse in security, PM Modi’s Ferozepur Rally Called Off, PM Modi’s Ferozepur visit in Punjab, PM Modi’s Ferozepur visit in Punjab cancelled, PM Stuck on Flyover

పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉత్కంఠ రేపింది. ప్రధాని కాన్వాయ్ లోని భద్రతాధికారులకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయారు. ఫలితంగా మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడింది. అయితే, ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే ప్రధాని పర్యటనలో అపశృతి చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించేందుకు ప్రధాని మోదీ పంజాబ్ కి వచ్చారు. హెలికాప్టర్ ద్వారా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై పంజాబ్ డీజీపీకి, సమాచారమిచ్చారు. ప్రధాని ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లపై లోకల్ పోలీసుల ధ్రువీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరింది. అయితే, మార్గమధ్యంలో మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సమయానికి కొందరు ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు.

దీంతో, ప్రధాని కాన్వాయ్ 15-20 నిమిషాల పాటు ప్రధాని ఫ్లైఓవర్ పై నిలిచిపోవాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని పర్యటన గురించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. పంజాబ్ ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని మండిపడింది. రహదారి వెంట అదనపు బలగాలను మోహరించలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించి పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =