ఐపీఎల్ మెగా వేలం-2022: తొలిరోజున 10 ప్రాంఛైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళే…

IPL Mega Auction 2022 Live Updates, IPL Mega Auction 2022, IPL Mega Auction 2022 Live Updates, Mega Auction 2022 Live Updates, Mega Auction 2022, IPL auction 2022 live, 2022 IPL Teams, IPL, IPL Latest News, IPL Latest Updates, IPL Live Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Cricket Live Updates, Mango News, Mango News Telugu, Indian Premier League,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియ బెంగళూరులో జరుగుతుంది. నేడు, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండ్రోజుల పాటుగా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 590 మంది క్రికెటర్లలో 370 మంది భారత్, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళలో 228 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 355 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు 7 మంది అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు.

బెంగుళూరులో జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో తొలి రోజున అప‌సృతి చోటు చేసుకుంది. వేలం నిర్వాహకుడు (ఆక్షనీర్) హ్యూ ఎడ్మీడెస్ వేదికగా వద్ద కుప్ప‌కూలాడు. దీంతో వేలం కొద్దిసేపు నిలిచిపోయింది. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం ప్రారంభమయింది. శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగకు సంబంధించి వేలం జరుగుతుండగా, ఒక్కసారిగా హ్యూ ఎడ్మీడెస్ కింద ప‌డిపోయారు. వెంటనే వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌ ప్రారంభంలో రిచర్డ్‌ మాడ్లీ వేలం నిర్వాహకుడిగా ఉండగా, 2018 నుండి హ్యూ ఎడ్మీడెస్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఐపీఎల్-2022 వేలం అప్‌డేట్స్:

 • ప్రసిద్ కృష్ణ – రూ.10 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • శార్దూల్ ఠాకూర్ – రూ.10.75 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • ఇషాన్ కిషన్ : భారత్ యువ క్రికెటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈ రోజు వేలంలో రికార్డ్ ధరతో సంచలనం సృష్టిస్తూ ‘రూ.15.25 కోట్లు’ పలికాడు. అతని కనీస ధర రూ.2 కోట్లు కాగా రూ.15.25 కోట్లుకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇషాన్ కిషన్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి.
 • ఐపీఎల్ వేలంలో పలువురు కీలక ఆటగాళ్లకు షాక్ తగిలింది. భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా, సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను వేలంలో ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
 • శిఖర్ ధావన్ : రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ కు దక్కించుకుంది.
 • రవిచంద్రన్ అశ్విన్ : రూ.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
 • ప్యాట్‌ కమ్మిన్స్‌ : రూ.7.25 కోట్లుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
 • కసిగో రబడా – రూ.9.25 కోట్లు – పంజాబ్ కింగ్స్‌
 • ట్రెంట్ బౌల్ట్ – రూ.8 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • శ్రేయాస్ అయ్యర్ – రూ.12.25 కోట్లు – కోల్‌కతా నైట్‌రైడర్స్‌
 • మహమ్మద్ షమీ: రూ.6.25 కోట్లుకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
 • ఫాఫ్ డు ప్లెసిస్: రూ.7 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌ దక్కించుకుంది.
 • క్వింటన్ డి కాక్ – రూ.6.75 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • డేవిడ్ వార్నర్‌ – రూ.6.25 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • మనీష్ పాండే – రూ.4.6 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • హేట్మార్ – రూ.8.5 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • రాబిన్ ఊతప్ప – రూ.2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
 • జేసన్ రాయ్ – రూ.2 కోట్లు – గుజరాత్ టైటాన్స్
 • దేవ్ దత్ పడిక్కల్ – రూ.7.75 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • డీజే బ్రావో – రూ.4.4 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
 • నితీష్ రాణా – రూ.8 కోట్లు – కోల్‌కతా నైట్‌రైడర్స్‌
 • జేసన్ హోల్డర్ – రూ.8.75 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • షకిబుల్ హాసన్ ను ఏ జట్టు ఎంచుకోలేదు.
 • హర్షల్ పటేల్ – రూ.10.75 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌
 • దీపక్ హూడా – రూ.5.75 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • హానిదు హాసరంగా – రూ.10.75 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌
 • వాషింగ్టన్ సుందర్ – రూ.8.75 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • క్రూనాల్ పాండ్యా – రూ.8.25 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • మిచెల్ మార్ష్ – రూ.6.50 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • మాథ్యూ వేడ్, మహమ్మద్ నబీలను ఏ జట్టు కొనుగోలు చేయలేదు
 • అంబటి రాయుడు – రూ.6.75 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
 • జానీ బెయిర్ స్టో – రూ.6.75 కోట్లు – పంజాబ్ కింగ్స్‌
 • దినేశ్ కార్తీక్ – రూ.5.5 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌
 • వృద్ధిమాన్ సాహా, సామ్ బిల్లింగ్స్ లను ఏ జట్టు కొనుగోలు చేయలేదు
 • నికోలస్ పురాన్ – రూ.10.75 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • టి.నటరాజన్ – రూ.4 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • దీపక్ చాహర్ – రూ.14 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
 • ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, అదిల్ రషీద్, ముజీబ్ యూఆర్ రహమాన్, ఇమ్రాన్ తాహిర్, ఆడమ్ జాంపా ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు
 • లాకి పెర్గ్యూసన్ – రూ.10 కోట్లు – గుజరాత్ టైటాన్స్
 • జోష్ హాజెల్ వుడ్ – రూ.7.75 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌
 • మార్క్ వుడ్ – రూ.7.5 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
 • భువనేశ్వర్ కుమార్ – రూ.4.2 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • ముస్తాఫిజర్ రహమాన్ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • కుల్దీప్ యాదవ్ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • రాహుల్ చాహర్ – రూ.5.25 కోట్లు – పంజాబ్ కింగ్స్‌
 • యజ్వేంద్ర చాహల్ – రూ.10 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • రజత్ పాటిదార్, హరి నిశాంత్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు
 • ప్రియం గార్గ్ – రూ.20 లక్షలు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • అభినవ్ మనోహర్ – రూ.2.60 కోట్లు – గుజరాత్ టైటాన్స్
 • దేవాల్డ్ బ్రేవిస్ – రూ.3 కోట్లు – ముంబయి ఇండియన్స్
 • అశ్విన్ హెబ్బర్ – రూ.20 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
 • రాహుల్ త్రిపాఠి – రూ.8.5 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • రియాన్ పరాగ్ – రూ.3.8 కోట్లు – రాజస్థాన్ రాయల్స్‌
 • సర్పరాజ్ ఖాన్ – రూ.20 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
 • అభిషేక్ శర్మ – రూ.6.5 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
 • షారుఖ్ ఖాన్ – రూ.9 కోట్లు – పంజాబ్ కింగ్స్‌
 • శివమ్ మావి – రూ.7.25 కోట్లు – కోల్‌కతా నైట్‌రైడర్స్‌
 • రాహుల్ తేవాతియా – రూ.9 కోట్లు – గుజరాత్ టైటాన్స్
 • కమలేష్ నగరకోటి – రూ.1.1 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
 • హాప్రీత్ బార్ – రూ.3.8 కోట్లు – పంజాబ్ కింగ్స్‌
 • షాబాజ్ అహ్మద్ – రూ.2.4 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =