నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్‌ 1 ప్రయోగం వాయిదా

NASAs Artemis 1 Moon Mission Postponed due to a Malfunctioning in Engine, NASAs Artemis 1 Moon Mission Postponed, NASA Artemis I Engine Malfunction, NASA Is Set To Launch The Artemis 1 Mission, NASA Artemis I Mission Launch, Mango News, Mango News Telugu, Artemis 1 Launch, NASA Artemis I Moon Mission Launch, NASA Artemis 1 Moon Mission, Artemis I Launch Latest News And Updates, NASA Artemis 1 Launch Live Updates, NASA Artemis I Mission,

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఆగస్ట్ 29, సోమవారం నాడు ఉదయం ప్రతిష్టాత్మక ఆర్టెమిస్‌ 1 ప్రయోగం తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా అపోలో మూన్ ల్యాండింగ్ తర్వాత 50 ఏళ్లకీ, చంద్రుడిపైకి నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ 1 మూన్ మిషన్ చివరి గంటలో వాయిదా పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఆర్ఎస్-25 ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముందుగా ప్రయోగం కౌంట్ డౌన్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ఆర్టెమిస్ 1 ప్రయోగం వాయిదా పడిందని నాసా ప్రకటించింది. “ఇంజిన్ బ్లీడ్ సమస్యపై టీమ్‌లు పని చేస్తున్నందున ఆర్టెమిస్ 1 యొక్క లాంచ్ ఈరోజు జరగదు. బృందాలు డేటాను సేకరిస్తూనే ఉంటాయి మరియు తదుపరి ప్రయోగ ప్రయత్నానికి సంబంధించిన సమయాన్ని మేము మీకు తెలియజేస్తాము” అని నాసా తెలిపింది. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపట్టనున్నారో వెల్లడించప్పటికీ, ఇంజిన్ లో సాంకేతిక సమస్యలను పరిష్కరించాక, తదుపరి ప్రయోగ అవకాశం సెప్టెంబర్ 2 లేదా సెప్టెంబర్ 5న ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ముందుగా ఆర్టెమిస్‌ 1 పేరుతో 50 ఏళ్ల తర్వాత నాసా అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆర్టెమిస్ 1 అనేది చంద్రుడు మరియు అంగారక గ్రహంపై మానవ అన్వేషణను ప్రారంభించే సంక్లిష్టమైన మిషన్ల శ్రేణిలో మొదటిది. ఈ ప్రయోగంలో ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌, ఓరియన్ క్యాప్సూల్ ఉండనుంది. అయితే వ్యోమగాములు లేకుండానే ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ 1 ఆరు వారాల పాటు కొనసాగనుండగా, తరువాత ఆర్టెమిస్ మిషన్లలో ఉపయోగించబడే అన్ని రాకెట్ దశలు మరియు అంతరిక్ష నౌకలను ఇది పరీక్షించనుంది. ఆర్టెమిస్‌ 1 కక్ష్యకు చేరుకున్న తర్వాత మరియు ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ చేసిన తర్వాత, మిషన్ పది క్యూబ్‌శాట్ ఉపగ్రహాలను మోహరిస్తుంది. ఇక ఓరియన్ అంతరిక్ష నౌక ఆరు రోజుల పాటు సుదూర తిరోగమన కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఓరియన్ తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించి, దాని ఉష్ణ కవచం ద్వారా రక్షించబడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. ఇక తరవాత చేపట్టే ఆర్టెమిస్‌-2, ఆర్టెమిస్‌-3 ప్రయోగాలు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here