త్వరలోనే సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చేపడతాం – మంత్రి హరీష్‌ రావు

Minister Harish Rao Launches 2k Run During National Sports Day in Siddipet Today, Minister Harish Rao Launches 2k Run, Minister Harish Rao Assures Sports Facilities In Siddipet, Sports Facilities In Siddipet, Mango News, Mango News Telugu, National Sports Day, National Sports Day 2022, Minister Harish Rao 2K Run, Minister Harish Rao Participates in 2K Run, Minister Harish Rao Latest News And Updates, TRS Party

నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం సిద్ధిపేట కోమటి చెరువు – నెక్లెస్ రోడ్డు వద్ద జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా.. పలువురు కోచ్‌లు, క్రీడాకారులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఇక దీనిలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత తదితరులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లడుతూ.. ఇప్పటికే సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం, ఫుట్ బాల్, వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేసుకున్నామని, త్వరలోనే ఇతర క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కూడా చర్యలు చేపడతామని తెలిపారు. దీనిలో భాగంగా ముందుగా 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్పోర్ట్స్ అవసరమని అన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగినందున యోగ, క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని, ఇది మంచి పరిణామమని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =