ఏపీలో రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ‘ఒబెరాయ్‌ గ్రూప్‌’ హోటల్స్ నిర్మాణం.. సీఎం జగన్‌ను కలిసిన సీఈఓ రాజారామన్‌ శంకర్‌

Oberoi Group President Rajaraman Shankar Meets CM Jagan To Explain about Their Plans to Build Star Hotels in AP, Oberoi Group To Set Up 7-star Hotels In Ap, Oberoi Group To Invest Rs 1500 Cr In Ap , Mango News, Mango News Telugu, Oberoi Group , President Rajaraman Shankar , Rajaraman Shankar Meets CM Jagan, AP CM YS Jagan Mohan Reddy, Oberoi Group Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy News And Live Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి ప్రఖ్యాత ‘ఒబెరాయ్‌ గ్రూప్‌’ హోటల్స్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ. 1500 కోట్ల పెట్టుబడులతో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఒబెరాయ్‌ గ్రూప్‌ సిద్ధమైంది. ఈ మేరకు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి రాజారామన్‌ శంకర్‌ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ప్రణాళికలు గురించి ఆయన సీఎం జగన్‌కు వివరించారు.

ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ముందుగా విశాఖపట్నం, తిరుపతి, హర్సిలీహిల్స్, గండికోట, పిచ్చుకలంక తదితర ప్రాంతాల్లో స్టార్ హోటల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పాడేరు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక టూరిజం సెంటర్‌ నిర్మించేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. ఇక రాష్ట్రంలో రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి పరోక్షంగా 10 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు రాజరామన్ సీఎంకు వివరించారు. సీఎం జగన్ దీనిపై స్పందిస్తూ.. ఏపీలో ఒబెరాయ్‌ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్‌ విండో విధానంలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here