కొత్తరకం కరోనా వైరస్: ఫ్రాన్స్ లో కూడా మొదటి కేసు నమోదు

New Coronavirus Strain: France Reports its First Case,First Case Of New Covid Variant Found In France As Cases Rise,France Confirms First Case Of New Coronavirus Strain After Citizen Returns From UK,France Reports First Case Of New Covid Variant,First Case Of New Covid Variant Found In France,Covid-19 Variant Updates,France Reports First Case,France Reports First Case Of UK Coronavirus Variant,France Registers First Case Of New Strain Of Coronavirus,New Coronavirus Strain,New Coronavirus Strain Latest News,News COVID-19 Strain,News COVID-19 Strain Updates,News COVID-19 Strain Latest News,France,France New Coronavirus Strain,Mango News,Mango News Telugu,France Reports its First Case

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభణతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించగా, మరికొన్ని దేశాలు ప్రయాణికులకు కోసం ప్రత్యేక క్వారంటైన్ నియమాలు అమల్లోకి తెచ్చాయి. అయినప్పటికీ కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ ఇతర దేశాల్లో కూడా వెలుగుచూస్తోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, డెన్మార్క్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాలో కేసులు నమోదుకాగా, తాజాగా ఫ్రాన్స్‌ లో కూడా కొత్త రకం కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది.

బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికీ కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలగా, వైరస్ నిర్ధారణపై తదుపరి పరీక్షలు చేయగా కొత్త రకం వైరస్‌ గా నిర్ధారణ అయినట్లుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితున్ని క్వారంటైన్ లో ఉంచి, అతని ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొత్త రకం కరోనా వ్యాప్తిపై వివరాలు సేకరిస్తుంది. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, కరోనా యొక్క అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =