చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం, నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు

Oscar Awards-2023: RRRs Naatu Naatu Song Wins Best Original Song INDIAs First Ever Oscar in the Best Song Category,Oscar Awards 2023,RRR's 'Naatu Naatu' Song Wins,Best Original Song INDIA,First Ever Oscar in the Best Song Category,Mango News,Mango News Telugu,Oscars 2023,SS Rajamouli RRR Creates History,RRR Song Natu Natu,RRR Naatu Naatu Bags Best Original Song,RRR Won Oscar For Best Original Song,Naatu Naatu WINS Oscar 2023,Oscar Awards Live,SS Rajamouli'S RRR Creates History,RRR Latest Updates,RRR Latest News,Oscar 2023 News,Oscar 2023 Latest Updates,Oscar 2023 News Today,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Naatu Naatu Video Song,Oscars 2023 full winners List,Rahul Sipligunj,Oscars 95,95th Academy Awards,Global Star Ram Charan,Oscars 2023 Winners LIVE Updates,Ram Charan Movies,Jr NTR,Jr NTR Movies,MM Keeravani,Lyricist Chandra Bose,Oscars 2023 Highlights

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నేడు ఘనంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్‌ నటీనటులంతా హాజరయ్యారు. కాగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడంతో భారతీయ సినీ చరిత్రలో మరుపురాని ఘట్టం నమోదైంది. నాటు నాటుతో బెస్ట్ సాంగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి ఆస్కార్‌ను అందించిన మొదటి చలనచిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ లోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్: చంద్రబోస్, గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్) ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.

ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకుందని ప్రకటించగానే డాల్బీ థియేటర్‌ కరతాళ ధ్వనులతో మోగిపోయింది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌ సహా హాజరైన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందమంతా ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అవార్డు అందుకున్నాక కీరవాణి మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ దేశాన్ని గర్వ పడేలా చేసిందని, తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ, అందరికి నమస్తే అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్ 2023 నామినేషన్స్ లో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ చిత్రం నుండి ‘అప్లాజ్’, టాప్ గన్:మావెరిక్ చిత్రం నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’, బ్లాక్ పాంథర్:వకాండ ఫరెవర్ చిత్రం నుండి ‘లిఫ్ట్ మి అప్’ మరియు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ చిత్రం నుండి ‘దిస్ ఈజ్ ఎ లైఫ్’ సాంగ్స్ తో నాటు నాటు సాంగ్ పోటీ పడి ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.

అవార్డుల వేడుక ప్రారంభానికి ముందుగా రెడ్ కార్పెట్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. ముఖ్యంగా హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా వీరిద్దరి రాయల్ లుక్ ప్రపంచ వేదికపై అందరిని ఆకట్టుకుంది. వీరిద్దరూ అద్భుతంగా డిజైన్ చేసిన బ్లాక్ సూట్స్ లో మెరుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచారు. దర్శకుడు రాజమౌళి, అతని కుటుంబసభ్యులు భారతీయత ఉట్టిపడే విధంగా ట్రెడిషన్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఇక అవార్డుల వేడుక ప్రారంభమయ్యాక ‘నాటు నాటు’ సాంగ్ ప్రదర్శన జరిగింది. సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ లో సాంగ్ పాడుతుండగా, వెస్టర్న్ డాన్సర్స్ తమ నృత్య ప్రదర్శనతో ఉర్రుతలూగించడంతో డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here