రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హాజరైన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి

Oscar Winner MM Keeravani Receives Padma Shri Award From President Murmu RRR Director SS Rajamouli Attends,Oscar Winner MM Keeravani,MM Keeravani Receives Padma Shri Award,Keeravani Receives Padma Shri Award From President Murmu,RRR Director SS Rajamouli Attends,Mango News,Mango News Telugu,MM Keeravani receive Padma Shri 2023,SS Rajamouli is a proud brother,Music Director MM Keeravani,President of India Droupadi Murmu,MM Keeravaani,Composer of RRR Naatu Receives Padma Shri,Padma Shri Awards 2023,MM Keeravani Latest News,Padma Shri Award 2023 Live News

భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘పద్మశ్రీ’ అవార్డులను బుధవారం రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆస్కార్-విజేత, ప్రముఖ టాలీవుడ్ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే ఆయనతో పాటు కళలకు సంబంధించి ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్, తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరియు గాయని వాణీ జైరామ్‌లకు పద్మశ్రీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే కీరవాణి సోదరుడు, ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. తెలుగు స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజులుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సంగీత దర్శకుడిగా పనిచేసిన కీరవాణి అంతర్జాతీయంగా పలు అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డులను అందుకున్నాడు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సంబంధించిన విజువల్స్‌ను రవీనా టాండన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి దిగిన తమ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంది. కాగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న కీరవాణిని అభినందిస్తూ తెలుగు చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =