ఆస్కార్‌ 2022 విజేతలు వీరే, ఉత్తమ నటుడుగా విల్‌ స్మిత్‌

Oscars 2022 Full List of Awards Winners, Oscars 2022 Full List of Oscar Awards Winners, Full List of Oscar Awards Winners, Oscar Awards Winners, Oscar Awards Winners 2022, Oscar Award, Oscars 2022, 2022 Oscars, Full List of the 94th Academy Awards Winners, 94th Academy Awards Winners, 94th Academy Awards, Full list of nominees and winners Of 94th Academy Awards, full list of 2022 Oscars winners, 2022 Oscars Winners List Here, Oscars 2022 Latest News, Oscars 2022 Latest Updates, Oscar, Mango News, Mango News Telugu,

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నేడు ఘనంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్‌ నటీనటులంతా హాజరయ్యారు. ఈసారి ‘డ్యూన్‌’ చిత్రం ఆరు ఆస్కార్‌ అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మరియు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ‘డ్యూన్‌’ చిత్రం అవార్డులు దక్కుంచుకుంది. ఇక కింగ్‌ రిచర్డ్‌ సినిమాకు గానూ హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ ఉత్తమ నటుడుగా ఆస్కార్ గెలుచుకున్నాడు. కాగా విల్ స్మిత్ కు ఇదే మొదటి ఆస్కార్ కావడం విశేషం. ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ చిత్రంలో నటనకు గానూ జెస్సీకా చాస్టెయిన్‌ ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. ది పవర్ ఆఫ్ ది డాగ్ చిత్రానికి జాన్‌ కాంపియన్‌ ఉత్తమ దర్శకుడు కేటగిరిలో ఆస్కార్ అందుకుంది.

మరోవైపు ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది. వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ ను నటుడు విల్‌ స్మిత్‌ చెంప దెబ్బ కొట్టాడు. ముందుగా అవార్డ్స్ ప్రకటన సందర్భంగా జుట్టు లేకుండా గుండుతో ఈ షోకి హాజరైన విల్‌ స్మిత్‌ వైఫ్ జాడా పింకెట్‌ స్మిత్ ప్రస్తావన తెస్తూ క్రిస్‌ రాక్‌ ఒక జోక్ చెప్పారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలోనే జుట్టులేకుండా గుండుతో ఉంటున్నట్టు జాడా పింకెట్‌ గతంలో ప్రకటించారు. క్రిస్‌ రాక్‌ జోక్ పై ఆగ్రహానికి గురైన విల్ స్మిత్ ఒక్కసారిగా లేచి వేదికపైకి వెళ్లి ఆయన్ను చెంపై కొట్టారు. వేదిక నుంచి వచ్చాక కూడా తన భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దని క్రిస్‌ రాక్‌ ను విల్ స్మిత్ హెచ్చరించారు. ఈ ఘటనతో డాల్బీ థియేటర్‌లో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా కింగ్‌ రిచర్డ్‌ సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు అందుకునేందుకు వేదికపై వచ్చిన విల్‌ స్మిత్‌ ముందు జరిగిన ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. “నేను అకాడమీకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నా తోటి నామినీలందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను” అని విల్ స్మిత్ పేర్కొన్నారు.

ఆస్కార్‌ 2022 విజేతలు వీరే:

  • ఉత్తమ చిత్రం: కోడా
  • ఉత్తమ నటుడు: విల్‌ స్మిత్‌ – కింగ్‌ రిచర్డ్‌
  • ఉత్తమ నటి: జెస్సీకా చాస్టెయిన్‌ – ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ
  • ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌స‌ర్‌ – కోడా
  • ఉత్తమ సహాయక నటి: అరియనా డిబోస్ – వెస్ట్ సైడ్
  • ఉత్తమ దర్శకురాలు: జాన్‌ కాంపియన్‌ – ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్ ప్లే: కెన్నెత్‌ బ్రనాగ్‌ – బెల్‌ఫాస్ట్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: డ్రైవ్‌ మై కార్‌ – జపాన్‌
  • ఉత్తమ యానిమేటేడ్‌ ఫీచర్‌: ఎన్‌కాంటో
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: డ్యూన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: సమ్మర్ ఆఫ్ సోల్
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ద లాంగ్ గుడ్ బై
  • ఉత్తమ సౌండ్ : డ్యూన్‌ (మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌)
  • ఉత్తమ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్: బిల్లీ ఎలిష్ – నో టైమ్‌ టు డై
  • ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫై
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షాన్ హైడర్ (కోడా)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్టు : ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌
  • ఉత్తమ​ ప్రొడక్షన్ డిజైన్‌: డ్యూన్‌
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్ : ది విండ్‌షీల్డ్‌ వైపర్‌
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: డ్యూన్
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్‌)

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =