సంచలనం నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్ ప్రభుత్వం

Mango News Telugu, New Zealand, New Zealand plans to ban smoking for the next generation, new zealand smoking age, new zealand smoking ban news, New Zealand to ban cigarette sales for future generations, New Zealand to ban cigarette sales for next generations, New Zealand to ban cigarettes, New Zealand to ban cigarettes for future generations, New Zealand To Ban Smoking, New Zealand To Ban Smoking For Future Generations, New Zealand to ban smoking for next generation, new zealand tobacco ban

న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. భావితరాల ఆరోగ్యం కోసం సంచలనాత్మక చట్టం తీసుకువస్తోంది. మిగిలిన ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 2027 నాటికి స్మోక్ ఫ్రీ జనరేషన్ నిర్మించటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సప్తవ్యసనాలలో ధూమపానం కూడా ఒకటి. ఒకసారి దీనికి అలవాటు అయితే వదిలించుకోవటం చాలా కష్టం. చాలామందికి ఇది టీనేజ్ వయసులోనే అలవాటుగా మారుతుంది. మొదట్లో సరదాగా మొదలైన ఈ అలవాటు చివరికి వ్యసనంగా మారుతుంది. జీవితాన్నే కబళిస్తుంది.

అందుకే, న్యూజిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు దీనిని తమ దేశంలో అరికట్టేందుకు ఒక వినూత్న చట్టాన్ని తీసుకువస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ చట్టం అమలులోకి రానుంది. దీని ప్రకారం.. 14 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు అమ్మటం చట్ట వ్యతిరేకం. ఇలా ప్రతి సంవత్సరం ఈ వయసుని పెంచుకుంటూ పోనుంది. దీనివలన కొన్ని సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా 2008వ సంవత్సరం తర్వాత పుట్టిన వారెవరూ జీవితంలో సిగరెట్లు జోలికి పోకుండా అడ్డుకట్ట వేయనుంది. అలాగే, దేశంలో ఉన్న సిగరెట్ల విక్రయ షాపులను కూడా క్రమంగా తగ్గించటానికి ప్రణాళికలు రచిస్తోంది అక్కడి ప్రభుత్వం. భావితరాల కోసం ఇటువంటి గొప్ప నిర్ణయాలను తీసుకోవటం నిజంగా హర్షించదగిన విషయం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =