తెలంగాణలో పోలీస్ నియామక తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు, టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటన

Police Recruitment in Telangana TSLPRB Revised Schedule for Conduct of Final Written Examinations, Telangana State Level Police Recruitment Board Recruitment, TSLPRB Revised Schedule for Conduct of Final Written Examinations, Police Recruitment in Telangana, Telangana Police Recruitment, TSLPRB Revised Schedule, Final Written Examinations, 2023 Telangana Police Recruitment, Telangana Police Recruitment 2023, Telangana Police Recruitment News, Telangana Police Recruitment Latest News And Updates, Telangana Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) జనవరి 1న ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నుండి వచ్చిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని, పోలీస్ బోర్డు మరియు టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా తుది రాత పరీక్షల షెడ్యూల్‌లో కొన్ని తేదీలు మార్పులు చేయబడ్డాయని టీఎస్‌ఎల్‌పీఆర్బీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎస్సై ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నికల్‌ పేపర్ పరీక్ష, ఏఎస్సై ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నికల్‌ పేపర్ పరీక్షలను మార్చి 12వ తేదీ నుంచి 11కు, కానిస్టేబుల్ (సివిల్, ట్రాన్స్​పోర్ట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) జనరల్ స్టడీస్ పరీక్షను మరియు కానిస్టేబుల్ ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నికల్‌ పేపర్ పరీక్షను ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చినట్టుగా టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెల్లడించింది.

మార్పుల అనంతరం ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకై తుది పరీక్షల షెడ్యూల్ ఇదే:

 1. మార్చి 11 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఎస్సై ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ – టెక్నికల్‌ పేపర్ పరీక్ష – హైదరాబాద్ (సెంటర్)
 2. మార్చి 11 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – ఏఎస్సై ఫింగర్‌ ప్రింటింగ్‌ – టెక్నికల్‌ పేపర్ పరీక్ష – హైదరాబాద్
 3. మార్చి 26 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఎస్సై ట్రాన్స్​పోర్ట్​ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
 4. ఏప్రిల్ 2 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – కానిస్టేబుల్ డ్రైవర్ ఆపరేటర్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
 5. ఏప్రిల్ 2 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – కానిస్టేబుల్ మెకానిక్ – టెక్నికల్‌ పేపర్ పరీక్ష – హైదరాబాద్
 6. ఏప్రిల్ 8 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఆల్ ఎస్సై/ఏఎస్సై (సివిల్, ఐటీ, ట్రాన్స్​పోర్ట్, ఫింగర్ ప్రింట్) – అర్ధమెటిక్, రీజనింగ్ పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
 7. ఏప్రిల్ 8 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – ఆల్ ఎస్సై/ఏఎస్సై (సివిల్, ఐటీ, ట్రాన్స్​పోర్ట్, ఫింగర్ ప్రింట్) – ఇంగ్లీషు పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
 8. ఏప్రిల్ 9 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – సివిల్ ఎస్సై – జనరల్ స్టడీస్ పరీక్ష- హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
 9. ఏప్రిల్ 9 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – సివిల్ ఎస్సై – తెలుగు/ఉర్దూ పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
 10. ఏప్రిల్ 30 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – కానిస్టేబుల్ (సివిల్, ట్రాన్స్​పోర్ట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) – జనరల్ స్టడీస్ పరీక్ష – తెలంగాణలోని పాత 10 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో నిర్వహణ
 11. ఏప్రిల్ 30 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – కానిస్టేబుల్ ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ – టెక్నికల్‌ పేపర్ పరీక్ష – హైదరాబాద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =