పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, వినియోగదారులపై రోజురోజుకి భారం

fuel price hike, Fuel Prices Today, Fuel Retailers, Hyderabad, Latest Breaking News 2021, Mango News, Mumbai, Petrol And Diesel, Petrol and Diesel Price, Petrol and Diesel Price Today, petrol and diesel prices, Petrol And Diesel Prices Continue To Rise, Petrol And Diesel Prices Increase In Hyderabad, Petrol and Diesel Prices Rise, Petrol and Diesel Prices Rise in Country for Sixth Consecutive Day, Petrol Prices Continues To Increase, Petrol Prices Hike, Petrol Prices Hiked

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం కూడా పెరిగాయి. వరుసగా ఆరో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం మరింతగా పెరుగుతుంది. సోమవారం పెట్రోల్‌పై లీటరుకు 35 పైసలు, డీజిల్‌పై లీటరుకు 35 పైసలు ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరియు రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మెట్రో నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105 నుంచి రూ.115 వరకు ఉండగా, తాజా పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింతగా పెరిగి, సామాన్య ప్రజలపై భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు (లీటరుకు):

  • న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ.109.69, డీజిల్ రూ.98.42
  • కలకత్తా : పెట్రోలు ధర రూ.110.15, డీజిల్ రూ.101.56
  • ముంబయి : పెట్రోలు ధర రూ.115.50, డీజిల్ రూ.106.62
  • చెన్నై : పెట్రోలు ధర రూ.106.35, డీజిల్ రూ.102.59
  • హైదరాబాద్: పెట్రోలు ధర రూ.114.12, డీజిల్ రూ.107.40
  • బెంగళూరు: పెట్రోలు ధర రూ.113.56, డీజిల్ రూ.104.50.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =