ఏపీ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారుపేరు : ప్రధాని మోదీ

amit shah, Amit Shah Greets People of Andhra Pradesh on its Formation Day, Andhra Pradesh formation day celebrated, AP State Formation Day Celebrations, AP State Formation Day Celebrations 2021, Camp Office, Mango News, PM Modi, PM Modi Greets People of Andhra Pradesh on its Formation Day, State Formation Day to be celebrated today in Andhra Pradesh, Venkaiah Naidu Greets People of Andhra Pradesh on its Formation Day, Vice President Venkaiah Naidu, YS Jagan, YS Jagan unveils national flag at Tadepalli

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి బాలాజీ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తారని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eight =