గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, బీజేపీ చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Eight of 11 Goa Congress MLAs Join BJP in Presence of Goa CM Pramod Sawant, Eight Goa Congress MLAs join BJP, Congress Collapses In Goa, 8 Goa Congress MLAs, Eight Cong MLAs joined BJP , Mango News, Mango News Telugu, Big Jolt To Congress In Goa, 7 Other Congress MLAs Join BJP, 11 Congress MLAs Join Bjp In Goa, Goa Congress, Goa BJP, Goa CM Pramod Sawant, 11 Goa Congress MLAs Join BJP

గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గోవాలో గత మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 11 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు బుధవారం నాడు భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ షెట్ తనవాడే సమక్షంలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, సంకల్ప్ అమోంకర్, డెలీలా లోబో, కేదార్ నాయక్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, రాజేష్ ఫాల్దేశాయ్, అలెక్సో సిక్వేరా ఉన్నారు.

కాగా 11 మందిలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో గోవా కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనీ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి వారు లేఖ కూడా రాశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న తరుణంలో గోవాలో చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది, అయితే కాంగ్రెస్ ఛోడో యాత్ర గోవాలో ప్రారంభమైందని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =