ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Extends Wishes To Vice President Venkaiah Naidu on His Birthday, Modi Extends Wishes To Vice President Venkaiah Naidu on His Birthday, Vice President Venkaiah Naidu Birthday, Vice President Of India Venkaiah Naidu, Vice President Venkaiah Naidu Birthday Greetings, Vice President Venkaiah Naidu Birthday Wishes, Vice President Of India Venkaiah Naidu, Venkaiah Naidu, Vice President Of India, VP Venkaiah Naidu Birthday Greetings, VP Venkaiah Naidu Birthday Wishes, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యను కీర్తిస్తూ.. వెంకయ్య నాయుడు గారు దశాబ్దాలుగా దేశానికి విశేషమైన సేవలందించారు. ఆయన మన పౌరులకు స్ఫూర్తిదాయకం. ఆయన ‘పౌరులకు స్ఫూర్తి’ అని అభివర్ణించారు. పెద్దల సభలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడంలో రాజ్యసభ ఛైర్మన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే 2017లో దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఈ సీనియర్‌ నేతతో కొన్నేళ్లపాటు సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించిందని ప్రధాని అన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న మక్కువ అద్భుతమైనది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు గారు. ఆత్మీయులు వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు.. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.

ఇక జనసేనాని వెంకయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ.. విలక్షణ వ్యక్తిత్వంతో కూడిన మానవతావాది వెంకయ్య అని ప్రశంసించారు. రాజకీయ పదవులైనా, రాజ్యాంగ పదవులైనా ఆయా పదవుల గౌరావాన్ని ఇనుమడింపజేశారని అన్నారు. ఆయన ప్రసంగాలలో చమత్కారం, చురుకుదనం, తెలుగు భాషపై ఆయనకున్న అవాజ్యమైన అనురాగం ఎంతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =