విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. లిఫ్ట్‌ వైర్‌ తెగి ముగ్గురు కార్మికులు దుర్మరణం

Three Workers Lost Lives and Several Injured in Lift Accident at Vijayawada Thermal Power Station,Three Workers Lost Lives at Vijayawada,Several Injured in Lift Accident at Vijayawada,Vijayawada Thermal Power Station Lift Accident,Mango News,Mango News Telugu,3 Fall To Death After Lift Cable Snaps,Vijayawada Thermal Power Station Latest News,Thermal Power Station News Today,Vijayawada Latest Updates,Vijayawada Live News,Vijayawada Thermal Station Updates

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం చోటుచేసుకుంది. ఇక్కడి విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్)లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ వైర్‌ తెగి పడిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాద సమయంలో లిఫ్టులో 8 మంది ఉన్నట్లు సమాచారం. కాగా ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, వీటీపీఎస్ సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. శనివారం ఉదయం పవర్‌ స్టేషన్‌లోని కార్మికులు కొందరు పైకి వెళ్లేందుకు లిఫ్టులోకి ఎక్కారు. అయితే పరిమితికి మించి బరువు ఉండటంతో లిఫ్ట్ కదలలేదు. దీంతో కొందరు దిగిపోగా మిగిలినవారు అందులోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పైకి ప్రయాణిస్తున్న లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో.. ఒక్కసారిగా అందరూ లిఫ్టుతో సహా కిందకు పడిపోయారు. కాగా మృతి చెందిన వారిని జార్ఖండ్ వాసులుగా గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here