ఈ 5 ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు..

Top 5 Places To Visit in Pune Centric Experiences You Can't Miss,Top 5 Places To Visit in Pune,Pune Centric Experiences,Experiences You Cant Miss,Top 5 Places To Visit,Mango News,Mango News Telugu,Pune tour, Pune 5 places,Simhagar Fort, Parvati Hills, Shanivarwada Fort, Aga Khan Palace, Dagdushet Halwai Temple,Top 5 Places To Visit Latest News,Top 5 Places To Visit Latest Updates,Pune Centric Experiences News Today,Pune Centric Experiences Live Updates,Pune Centric Experiences Latest News

టూరిస్టులకు పూనే పేరు గురించి పెద్దగా చెప్పక్కరలేదు కానీ.. చాలా మందికి పూనేలోని కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయని తెలియదు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా పూనే గురించి చెబుతారు. అందుకే వాళ్లు మహారాష్ట్ర ఎవరు వెళ్లినా పూనేని ఓసారి పలకరించాక కానీ తిరిగివెళ్లరు. ముఖ్యంగా కొన్ని హిస్టారికల్ ప్రాంతాల వల్లే పూనే అంతగా ఫేమస్ అయిందని అంటారు ప్రకృతి ప్రేమికులు. సిటీలో మరాఠీ కల్చర్ ఉన్నా.. సాంస్కృతిక వారసత్వంగా కనిపించే కట్టడాలు పూనేను ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ప్లేసులో నిలబెడతాయి.

ముఖ్యంగా పూనే పర్యటనలో మరాఠీ సంస్కృతిని చాలా దగ్గరగా చూడొచ్చు. దీంతో పాటు అక్కడి దొరికే స్ట్రీట్ ఫుడ్ కాస్త డిఫరెంట్ టేస్టుతో ఉండటం వల్ల పర్యాటకులు తినడానికి ఇష్టపడతారు. పైగా పూనేలో ఫుడ్ ఐటెమ్స్ అన్నీ హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి సిటీలతో పోలిస్తే చాలా తక్కువకే దొరకుతాయి. దీంతో ఫుడీస్‌కు పూనే అంటే ఇంకాస్త ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు అక్కడి వారు.

పూనేలో సందర్శించాల్సిన కొన్ని బెస్ట్ ప్లేసులు ఇప్పుడు చూద్దాం.

1) సింహఘర్ కోట.. పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి శ్రేణిలో గల సింహఘర్ కోట మహారాష్ట్రలో ఉన్న పురాతన కోటలలో ఒకటిగా చెబుతారు. ఈ కోటలోనే చాలా యుద్ధాలు జరిగాయని చరిత్రకారులు చెబుతారు.

2) పార్వతి కొండలు.. పూనే సిటీ పూర్తి అందాలు, సిటీలో కనువిందు చేసే అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి.. పార్వతి కొండలను మించింది లేదంటారు స్థానికులు. 2000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పార్వతి కొండలను 17వ శతాబ్దంలో పీష్వా బాజీరావు నిర్మించారట. శివపార్వతి అంకితం చేయబడిన ఈ కొండపై పార్వతి ఆలయం ఉండటం వల్ల వీటిని పార్వతి కొండలు అంటారు.

3) శనివార్వాడ కోట.. చారిత్రక ప్రదేశాలు చూడాలి అనుకున్నవారు పూనేలోని శనివార్వాడకు వెళ్లొచ్చు. శనివార్వాడ కోటను మొదటి పీష్వా బాజీరావ్ నిర్మించాడు. 625 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోట మొదట్లో పూనే సిటీని మొత్తాన్ని కవర్ చేసేదట. కానీ 1828 లో ఈ కోట చాలా వరకూ కాలిపోయింది. ఆ తర్వాత శనివార్వాడ కొన్ని అవశేషాలు మాత్రమే పూనేలో మిగిలి ఉన్నాయి.

4) ఆగాఖాన్ ప్యాలెస్.. 1892లో సుల్తాన్‌ .. పూనేలో ఉన్న ఆగాఖాన్ ప్యాలెస్ నిర్మించారట. బ్రిటిష్ పాలనలో, మహాత్మా గాంధీ, అతని భార్య కస్తూర్బా గాంధీ, కార్యదర్శి మహదేవ్ దేశాయ్ , సరోజినీ నాయుడు ఆగఖాన్ ప్యాలెస్‌లోనే ఖైదు చేయబడ్డారట. ఆ తర్వాత కస్తూర్బా గాంధీ, మహదేవ్ దేశాయ్ ఈ ప్యాలెస్‌లోనే మరణించారట. ఈ ప్యాలెస్‌‌లో అందమైన మ్యూజియం కూడా ఉంటుంది.

5) దగ్దుషేత్ హల్వాయి ఆలయం.. పూనేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి ఆలయం గణేశుడికి అంకితం చేయబడిందని చెబుతారు. ఈ ఆలయం లోపల 40 కిలోల బంగారంతో చేసిన గణపతి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గుడిలో ప్రతి ఏడాది గణేష్ మహోత్సవాన్ని10 రోజుల పాటు నిర్వహిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 4 =