రష్యా కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్‌-వి” : మొదటి బ్యాచ్ రెండు వారాలలో సిద్ధం

President Putin Daughter Gets Vaccinated, Russia approves world first coronavirus vaccine, Russia Corona Vaccine, Russia Covid Vaccine, Russia Covid Vaccine First Batch will Release with in 2 Weeks, Russia Covid-19 Vaccine, Russia Covid-19 Vaccine Latest News Update, Russia’s Covid Vaccine Sputnik V

ప్ర‌పంచంలో కోవిడ్-19 (కరోనావైరస్) కు వ్యాక్సిన్ తయారీ చేసిన తొలిదేశంగా రష్యా నిలిచిందని, ర‌ష్యా ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ను స్పుత్నిక్‌-వి గా రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ను రెండు వారాల్లోగా విడుదలకు సిద్ధం చేస్తునట్టు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కో వెల్లడించారు. ముందుగా దేశ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తామని, కొంతమేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని మురాస్కో తెలిపారు. ఆ దేశానికి సంబంధించిన గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ సహా మరో ఫార్మా సంస్థలో స్పుత్నిక్‌-వి ఉత్పత్తి మొదలుపెట్టారు. ఏడాదిలోనే 500 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్ ఇచ్చే వారి పరిస్థితిని పర్యవేక్షించేందుకు రష్యా ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా తయారుచేస్తునట్టు సమాచారం. ఈ యాప్ ద్వారా వ్యాక్సిన్ ప్రభావాలను అధ్యయనం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =