లద్దాఖ్‌లో పీఎం మోదీ ఆకస్మిక పర్యటన

Army Chief Naravane, CDS Bipin Rawat, Ladakh, Narendra Modi, national news, PM Modi Latest News, PM Modi Makes Surprise Visit to Ladakh, PM Modi Makes Surprise Visit to Ladakh Along with CDS Bipin Rawat, PM Modi Visit Ladakh, Prime Minister Narendra Modi

గాల్వాన్ లోయ ఘటన అనంతరం భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3, శుక్రవారం ఉదయం లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే తో కలిసి పీఎం మోదీ లద్దాఖ్‌ చేరుకున్నారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ లోని నిము ప్రాంతానికి చేరుకొని ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ అధికారులతో పీఎం మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో పరిస్థితులను అధికారులు పీఎంకి వివరించారు.

గాల్వాన్ లోయ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సీనియర్ అధికారులతో పీఎం మోదీ సమీక్ష జరపనున్నారు. అలాగే గాల్వాన్ లోయ ఘటనలో గాయపడ్డ జవాన్లను మిలటరీ ఆస్పత్రిలో మోదీ పరామర్శించనున్నారు. ఇటీవల సరిహద్దుల్లో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ లద్దాఖ్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సైనికులకు భరోసా ఇచ్చే నేపథ్యంలోనే పీఎం మోదీ లద్దాఖ్‌ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here