కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్ లో జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Jharkhand Coronavirus, Jharkhand Coronavirus Updates, Jharkhand Govt, Jharkhand Govt Extended Lockdown, Jharkhand Latest News, Jharkhand Lockdown, Jharkhand Lockdown Extended, Jharkhand News, Lockdown, Mango News Telugu

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జూలై 31 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. “కరోనా పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, లాక్‌డౌన్ జూలై 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని” ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాత్రి పూట కర్ఫ్యూను రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల మధ్య కొనసాగించనున్నారు.

పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు, సినిమా థియేటర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, బార్‌లు, ఆడిటోరియంలు, హోటళ్ళు, లాడ్జీలు, స్పాస్, సెలూన్లు, రెస్టారెంట్స్, సమావేశ మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరవడంపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అంతర్రాష్ట్ర మరియు రాష్ట్రంలో బస్సు సేవలకు అనుమతి లేదని చెప్పారు. ప్రైవేట్ వాహనాల ద్వారా రాష్ట్రంలోకి రావాలనుకుంటే ఈ-పాస్ అనుమతి ఉండాలని చెప్పారు. అయితే రాష్ట్రంలోని వ్యక్తుల కదలికలకు, రాష్ట్రం నుంచి వెళ్లేందుకు ఈ-పాస్ అవసరం ఉండదని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలతో పాటుగా రవాణా సమయంలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలని నిబంధన విధించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =