టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య

Tollywood Young Hero Sudheer Varma Committed Suicide at His Residence in Vizag Today,Tragedy In Tollywood,Young Actor Sudhir Varma,Sudhir Varma Committed Suicide,Mango News,Mango News Telugu,actor sudheer varma,sudheer varma movies,actor sudheer varma movies,movies of actor sudheer varma,Sudheer Varma Movies,Sudheer Varma Actor,Sudheer Varma All Movies,Sudheer Varma Films,Sudheer Varma Next Movie,Sudheer Varma Twitter,Kundanapu Bomma,Second Hand,Shootout at Alair

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కుందనపు బొమ్మ’ అనే సినిమాలో ఇద్దరు హీరోలలో ఒకరిగా ఆయన నటించాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో సుధీర్ కీలక పాత్రలో నటించాడు. అలాగే ‘సెకండ్ హ్యాండ్’, షూటౌట్’ వంటి మరో రెండింట్లో కూడా నటించాడు. అయితే ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో ఇలా అర్ధాంతరంగా తనువు ముగించడం సంచలనంగా మారింది. సుధీర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సరైన సినిమా అవకాశాలు రాకపోవడమా? ఆర్థికపరమైన వ్యక్తిగత కారణాలా? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. మరోవైపు సుధీర్ ఆత్మహత్యపై సుధాకర్ కోమాకుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సుధీర్ వర్మ లేడన్న విషయాన్ని తాను జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇక యువ నటుడి మరణంపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + one =