రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, మేరా రేషన్ మొబైల్ యాప్ ఆవిష్కరణ

Centre Launches Mera Ration App To Help Beneficiaries, Government launches Mera Ration mobile app, Govt launches Mera Ration app for migrant PDS beneficiaries, Govt launches Mera Ration Mobile App, Mango News, Mera Ration App, Mera Ration App News, Mera Ration Mobile APP, One Nation One Ration Card, One Nation One Ration Card Schem, one nation one ration card upsc, Union Govt Launches Mera Ration Mobile APP

రేషన్ కార్డుదారులకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. దేశంలో జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తున్న వారికి ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన ‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ను శుక్రవారం నాడు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఆవిష్కరించారు. అనంతరం ఒక దేశం-ఒక రేషన్ కార్డ్ వ్యవస్థ గురించి, మేరా రేషన్ యాప్ పనిచేసే విధానాన్నివివరించారు. ఒక దేశం-ఒక రేషన్ కార్డ్ వ్యవస్థను ముందుగా 2019 ఆగస్టులో నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ వ్యవస్థ అమలులోకి వచ్చిందని అన్నారు. మరికొన్ని నెలల్లో మిగిలిన నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలైన అస్సాం, ఛత్తీస్ ఘడ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవస్థ అమలులోకి రానుందని తెలిపారు. ఒక దేశం-ఒక రేషన్ కార్డ్ వ్యవస్థ కింద ప్రస్తుతం నెలకు సరాసరిన 1.5 నుంచి 1.6 కోట్ల వరకు రేషన్ ఫోర్టాబిలిటీ లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు.

తాజాగా విడుదల చేసిన మేరా రేషన్ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో వచ్చింది. త్వరలోనే ఈ యాప్ ను 14 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా రేషన్ కార్డుదారులకు దగ్గరలోని రేషన్ దుకాణం, సరుకులు లావాదేవీలు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు ఒక దేశం-ఒక రేషన్ కార్డ్ విధానం ద్వారా రేషన్ కార్డు పోర్టబులిటీ కూడా చేసుకునే అవకాశం కల్పించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =