ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

PM Modi to Visit Bhopal on 1st April Will Flag Off Vande Bharat Express between Bhopal and New Delhi,PM Modi to Visit Bhopal on 1st April,PM Modi Will Flag Off Vande Bharat Express,Vande Bharat Express between Bhopal and New Delhi,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi,PM Modi Bhopal Visit,Vande Bharat Express Latest News,Vande Bharat Express Latest Updates,Vande Bharat Express Live News,PM Modi to Flag off Bhopal-New Delhi Express,PM to flag off Vande Bharat train,PM to visit Bhopal on 1st April,Narendra modi Latest News and Updates

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్‌ లోని కుషాభౌ థాక్రే హాల్‌ లో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2023కి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3.15 గంటలకు, భోపాల్‌ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో భోపాల్ మరియు న్యూఢిల్లీ మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

భోపాల్ లో మిలిటరీ కమాండర్ల మూడు రోజుల సమావేశం మార్చి 30 నుండి ఏప్రిల్ 1 వరకు ‘రెడీ, రేసుర్జెంట్, రెలెవంట్’ అనే థీమ్ తో నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా, సాయుధ దళాలలో ఉమ్మడిగా మరియు థియేటరైజేషన్‌తో సహా జాతీయ భద్రతకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ‘ఆత్మనిర్భర్త’ సాధించే దిశగా సాయుధ బలగాల సన్నద్ధత మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షిస్తారని, ఈ సదస్సులో త్రివిధ సాయుధ దళాలకు చెందిన కమాండర్లు మరియు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలిపారు.

ఇక దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మరియు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల మధ్య ప్రవేశపెట్టిన కొత్త రైలు దేశంలో పదకొండవ వందే భారత్ రైలు అవనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క స్వదేశీంగా రూపొందించబడిన రైలు సెట్‌లో అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఇది రైలు వినియోగదారులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని, పర్యాటకాన్ని పెంచడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =