జూన్ 16, 17 తేదీల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ధర్మశాలలో ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ కాన్ఫరెన్స్

PM Narendra Modi will chair the first national conference of chief secretaries at HPCA Stadium in Dharamshala, PM Modi will Chair First National Conference of Chief Secretaries at HPCA Stadium in Dharamshala, PM Modi to chair the first-ever National Conference of Chief Secretaries at HPCA Stadium in Dharamshala, Modi will Chair First National Conference of Chief Secretaries at HPCA Stadium in Dharamshala, HPCA Stadium in Dharamshala, Dharamshala HPCA Stadium, PM Modi will Chair First National Conference of Chief Secretaries, First National Conference of Chief Secretaries, National Conference of Chief Secretaries, Chief Secretaries, National Conference, National Conference of Chief Secretaries News, National Conference of Chief Secretaries Latest News, National Conference of Chief Secretaries Latest Updates, National Conference of Chief Secretaries Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

జూన్ 16, 17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ కాన్ఫరెన్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఇది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ముఖ్యమైన ముందడుగుగా కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశం జూన్ 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. డొమైన్ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే 200 మంది కంటే ఎక్కువ మంది ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని, మూడు రోజుల పాటు సాగే ఈ కాన్ఫరెన్స్ రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన, స్థిరమైన ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తుందని చెప్పారు. టీమ్ ఇండియాగా పని చేస్తూ, సుస్థిరత, ఉద్యోగాల కల్పన, విద్య, జీవన సౌలభ్యం మరియు వ్యవసాయంలో ఆత్మనిర్భర్తతో ఉన్నత వృద్ధికి సహకార చర్యలకు ఈ కాన్ఫరెన్స్ పునాది వేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షల సాధనకు కోసం ఉమ్మడి అభివృద్ధి ఎజెండా మరియు బ్లూప్రింట్ అమలుపై ఈ కాన్ఫరెన్స్ పనిచేస్తుందని చెప్పారు.

ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ఎజెండా ఆరు నెలల పాటు 100 రౌండ్ల కంటే ఎక్కువ చర్చల తర్వాత క్యూరేట్ చేయబడిందని, ఈ కాన్ఫరెన్స్‌లో వివరణాత్మక చర్చల కోసం మూడు థీమ్‌లు గుర్తించబడ్డాయన్నారు. ఒకటి జాతీయ విద్యా విధానం అమలు, రెండోది పట్టణ పాలన, మూడోది పంటల వైవిధ్యం మరియు నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఇతర వ్యవసాయ వస్తువులలో స్వయం సమృద్ధిని సాధించడంగా నిర్ణయించారు. జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠశాల మరియు ఉన్నత విద్య రెండూ చర్చించబడతాయని, అలాగే ఈ కాన్ఫరెన్స్‌లో ప్రతి థీమ్‌ల క్రింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించబడతాయన్నారు.

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంపై ఒక సెషన్ ఉంటుందని, ఇందులో నిర్దిష్ట జిల్లాల్లో యువ కలెక్టర్లు సమర్పించిన డేటా బేస్డ్ గవర్నెన్స్‌తో సహా విజయవంతమైన కేస్ స్టడీస్‌తో పాటు ఇప్పటివరకు సాధించిన విజయాలపై చర్చించబడుతుందని తెలిపారు. అదేవిధంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: రోడ్‌మ్యాప్ టు 2047’పై కూడా ప్రత్యేక సెషన్ ఉంటుందన్నారు. కాగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ హాజరయ్యే నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి సమావేశంలో ఈ సమావేశం యొక్క ఫలితాలు తరువాత చర్చించబడతాయని, తద్వారా అత్యున్నత స్థాయిలలో విస్తృత ఏకాభిప్రాయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =