ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు, జూలై 16న ప్రకటన?

BJP Likely to Announce Vice President Candidate on July 16, Vice President Candidate on July 16, BJP Likely to Announce Vice President Candidate, BJP To Pick Its Candidate For Vice President Polls, Vice President Polls, Vice President Elections, BJP Vice President Candidate, Vice President Candidate, vice-presidential election, BJP parliamentary board will meet this week to pick its vice presidential candidate, vice-presidential election News, vice-presidential election Latest News, vice-presidential election Latest Updates, vice-presidential election Live Updates, Mango News, Mango News Telugu,

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, జూలై 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తుండడంతో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కసరత్తు ముమ్మురం చేసింది. జూలై 16, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు తెలుస్తుంది.

కాగా బీజేపీ తరపున ఉప రాష్ట్రపతి బరిలో నిలిచే అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నఖ్వీ తో పాటుగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్, నజ్మా హెప్తుల్లా తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలన్ని కాంగ్రెసేతర ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించనున్నట్టు తెలుస్తుంది. ఉప రాష్ట్రపతి పదవికి తమ ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడానికి వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు జూలై 17న ఢిల్లీలో సమావేశం కానున్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. ఇక ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =