దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు డిగో మారడోనా కన్నుమూత

Argentina Pays Tribute To Legendary Diego Maradona, Diego Maradona death, Diego Maradona Dies, Diego Maradona Dies Of Heart Attack, Diego Maradona tributes, Football Player Diego Maradona, Football Player Diego Maradona Dies, Legendary Diego Maradona, Legendary Football Player Diego Maradona Dies Of Heart Attack, Mango News, President Declares 3 Days National Mourning, Soccer Legend Diego Maradona Dead at 60

ఫుట్‌బాల్‌ చరిత్రలో‌ ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా మారడోనా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే మెదడులో రక్తం గడ్డకట్టడంతో మారడోనా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మారడోనా తుదిశ్వాస విడిచినట్టు అర్జెంటీనా మీడియా వెల్లడించింది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారడోనా ప్రపంచస్థాయిలో అభిమానులను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. తనదైన శైలిలో రెప్పపాటులో గోల్స్ కొడుతూ, తన ప్రతిభతో ఫుట్‌బాల్‌ ఆటకు మారడోనా మాంత్రికుడిగా పేరు గడించారు. గోల్‌ ఆఫ్‌ ద సెంచరీ, ది గోల్డెన్‌ బాయ్, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్ ప్లేయర్, ఫిఫా వరల్డ్‌ కప్ ఇలా ఫుట్‌బాల్ ఆటకు సంబంధించినవి ఎన్నో తన ఖాతాలో వేసుకుని, సంవత్సరాల పాటుగా మారడోనా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు.

అర్జెంటీనా తరపున మారడోనా నాలుగు ప్రపంచకప్‌లలో ఆడారు. ప్రపంచకప్‌లలో మొత్తం 91 మ్యాచ్‌లు ఆడిన మారడోనా 34 గోల్స్‌ చేశారు. 1986 ప్రపంచకప్ లో కెప్టెన్‌గా, బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచి అర్జెంటీనాను చాంపియన్‌ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్ తీసుకెళ్లిన ఓడిపోవడంతో రన్నరప్ గా నిలిచింది. బార్సిలోనా, నపోలీ, బొకా జూనియర్స్ వంటి ఫుట్‌బాల్ క్లబ్స్ తరపున కూడా ఆడి ఎన్నో రికార్డులు సృష్టించాడు. 1997 వ సంవత్సరంలో మారడోనా ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. ఇక 2008–2010 కాలంలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా కూడా మారడోనా వ్యవహరించారు. మారడోనా మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు, పలు రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eight =