రాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ

Bhagwan Birsa Munda Museum in Ranchi, Mango News, PM Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan, PM Modi inaugurates Bhagwaan Birsa Munda Museum, PM Modi inaugurates Bhagwan Birsa Munda, PM Modi inaugurates Bhagwan Birsa Munda Museum in Ranchi, pm narendra modi, PM Narendra Modi Inaugurates Bhagwan Birsa Munda Museum, PM Narendra Modi Inaugurates Bhagwan Birsa Munda Museum in Ranchi, Ranchi

ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జార్ఖండ్ లోని రాంచీలో భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌ గవర్నర్‌ రమేశ్ బయాస్, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సంద‌ర్భంగా, దేశంలోని ఆదివాసీల సంప్రదాయాల‌కు, శౌర్య గాథ‌ల‌కు మ‌రింత అర్థ‌వంత‌మైన, మ‌రింత గొప్ప గుర్తింపును అందించాల‌ని దేశం నిర్ణ‌యించుకుందని చెప్పారు. ఇందు కోసం, ఈ రోజు నుండి దేశం ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీని అంటే భగవాన్ బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా జరుపుకోవాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడిందన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా జాతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన మ్యూజియం వైవిధ్యంతో నిండిన మన గిరిజన సంస్కృతికి సజీవ వేదికగా మారుతుందని, స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన వీరులు మరియు వీరుల సహకారాన్ని వర్ణిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =