పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ

PM Narendra Modi Releases over Rs 20000 Crores Under 8th Installment of PM-KISAN Scheme,Mango News,Mango News Telugu,PM Modi To Release 8th Instalment,PM-KISAN Scheme On May 14,PM Modi Releases 8th Instalment,PM-KISAN,PM Modi releases 8th instalment for PM-KISAN scheme,PM Kisan Samman Nidhi,PM Kisan Samman Nidhi,PM Kisan Samman Nidhi Yojana,PM Kisan Samman Nidhi Yojana Online,PM Kisan,Farmers,Prime Minister,8Th Instalment,PM kisan Is Being Released,Narendra Modi,Farmers Money,Kisan Nidhi,PM Kisan Yojana,PM Modi,PM Modi Speech Today,PM Modi Release 8th instalment of Financial Benefit under PM-KISAN,PM Modi LIVE,8th Instalment Of Financial Benefit Under PM-KISAN,PM Narendra Modi Releases 8th Installment of PM-KISAN

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జరిగిన ఈ నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌తో ప్ర‌ధాని మోదీ సంభాషించారు. కరోనా మహమ్మారి సమయంలో ఇబ్బందుల మధ్య ఆహార ధాన్యాల్లో, హార్టికల్చర్ లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధ్యమయ్యేలా చేసిన రైతుల కృషిని ప్రశంసించారు. ప్ర‌ధాని మోదీతో పాటుగా ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు.

ముందుగా దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద 8వ విడ‌త‌ రూ.2000 సాయాన్ని రైతుల‌ ఖాతాల్లో జ‌మ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఇందుకు అవ‌స‌ర‌మ‌య్యే రూ.20,000 కోట్ల‌కుపైగా నిధులను ప్ర‌ధాని న‌రేంద్ర ‌మోదీ విడుద‌ల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =