బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య కీలక పోరు, ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్‌

2021 West Bengal Assembly Elections, Mango News, political strategist Prashant Kishor, Political Strategist Prashant Kishor Tweets, Political Strategist Prashant Kishor Tweets On West Bengal Polls, Prashant Kishor, Prashant Kishor Tweets On West Bengal Polls, West Bengal Assembly Elections, West Bengal Assembly Elections 2021, West Bengal Assembly Elections Dates, West Bengal Assembly Elections News, West Bengal Elections, West Bengal Elections 2021, West Bengal Polls

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్ ‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించించేలా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ) మరియు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఇరుపార్టీల్లో నాయకులు, సినీనటులు, క్రీడాకారుల చేరికతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌ ఈ ఎన్నికల కోసం టీఏంసీతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ప్రశాంత్ కిషోర్‌ ఆసక్తికర ట్వీట్ చేశారు. “భారతదేశంలో ప్రజాస్వామ్యానికి కీలకమైన పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌ లో జరగనుంది. మరియు బెంగాల్ ప్రజలు తమ సందేశంతో, సరైన వైఖరి చూపించేందుకు సిద్ధమయ్యారు” అని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ స్లోగన్ అయినా “బెంగాల్‌ తమ సొంత కుమార్తెను మాత్రమే కోరుకుంటోంది” అనే స్లోగన్ ను జతచేశారు. అలాగే మే 2వ తేదీన నా చివరి ట్వీట్‌లో చెప్పిన విషయం గురించి వేచి ఉండండి అని పేర్కొన్నారు.

ముందుగా గత డిసెంబరు 21న బెంగాల్‌ ఎన్నికలపై చివరిసారిగా ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ”అనుకూల మీడియా ఇస్తున్న హైప్ పక్కనపెడితే, వాస్తవానికి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ రెండంకెల సీట్లను గెలుచుకోవడానికి కష్టపడుతుంది. దయచేసి ఈ ట్వీట్‌ను సేవ్ చేయండి. బీజేపీ ఏమైనా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తే నేను ఈ వేదిక నుంచి తప్పుకుంటా” అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతుంది. మరోవైపు బెంగాల్లో ఫేజ్-1 పోలింగ్ మార్చి 27 న, ఫేజ్-2 ఏప్రిల్ 1, ఫేజ్-3 ఏప్రిల్ 6, ఫేజ్-4 ఏప్రిల్ 10, ఫేజ్-5 ఏప్రిల్ 17, ఫేజ్-6 ఏప్రిల్ 22, ఫేజ్-7 ఏప్రిల్ 27, ఫేజ్-8 పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2 వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =