సాయంత్రం 5 గంటల వరకు 5 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు

2021 Assembly Elections, Assam, Assembly Elections 2021, Assembly Elections Polling in 5 States, Kerala, Kerala Assembly elections, Kerala Assembly Elections Polling, Mango News, Polling Underway for Tamil Nadu, Puducherry Assembly Elections, Puducherry Assembly Elections 2021, Puducherry Assembly Elections Polling, puducherry elections, Tamil Nadu Assembly elections, Tamil Nadu Assembly Elections Polling, Voting in 475 seats across 5 states, West Bengal, West Bengal Assembly Elections

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటుగా శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం:

  • తమిళనాడు: 62.86%
  • కేరళ : 69.81%
  • పుదుచ్చేరి : 77.87%
  • పశ్చిమబెంగాల్ : 77.67%
  • అస్సాం : 78.94%

–>అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ రోజు మొత్తం 475 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. అలాగే పలు పార్టీల అధినేతలు, సినీప్రముఖులు, క్రీడాకారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో‌ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్‌ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు.

–>తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాల్లో, కేరళలో 140 అసెంబ్లీ స్థానాల్లో, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఒకేదశలో పోలింగ్ పూర్తికానుంది. ఇక పశ్చిమబెంగాల్, అస్సాంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తవగా నేడు మూడో దశ పోలింగ్ జరుగుతుంది. నేటితో అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తవనుంది. అయితే పశ్చిమబెంగాల్ లో మాత్రం నేడు గాకా మరో 5 దశల పోలింగ్ మిగిలివుంది.

–>తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:

  • అసెంబ్లీ స్థానాలు: 234
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 3998
  • పోలింగ్ కేంద్రాలు : 88,937
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 6.2 కోట్లు

–>కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:

  • అసెంబ్లీ స్థానాలు: 140
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 957
  • పోలింగ్ కేంద్రాలు : 40,771
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 2.74 కోట్లు

–>పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:

  • అసెంబ్లీ స్థానాలు: 30
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 324
  • పోలింగ్ కేంద్రాలు : 1,559
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 10.04 లక్షలు

–>పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు (మూడో దశ):

  • అసెంబ్లీ స్థానాలు: 31
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 205
  • పోలింగ్ కేంద్రాలు: 10,871
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 78.52 లక్షలు

–>అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు (మూడో దశ):

  • అసెంబ్లీ స్థానాలు: 40
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 337
  • పోలింగ్ కేంద్రాలు: 11,401
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 79 లక్షలు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =