వాహనదారులకు గుడ్ న్యూస్, బీహెఛ్-సిరీస్ తో కొత్త రిజిస్ట్రేషన్ మార్క్‌ ప్రకటన

BH registration series, BH registration series for personal vehicles, Bharat Series of Registration Mark, Centre Facilitates New Registration Mark, Centre Introduced Bharat Series of Registration Mark, Centre Introduced Bharat Series of Registration Mark to Facilitate Seamless Transfer of Vehicles across States, Centre introduces ‘BH-series’ mark for personal vehicles, Centre introduces BH-series, Govt Introduces Bharat Series Registration Mark, Mango News, New registration mark for free vehicles transfer across

వాహనాల రిజిస్ట్రేషన్‌ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత్ సిరీస్ (బీహెఛ్-సిరీస్) కింద కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ మార్క్‌ను ప్రవేశపెడుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంది. మోటార్ వాహనాల చట్టం, 1988 సెక్షన్ 47 ప్రకారం, వాహనం రిజిస్టర్ చేయబడిన రాష్ట్రం మినహా ఇతర ఏ రాష్ట్రంలోనూ 12 నెలలకు మించి వాహనాన్ని ఉంచడానికి అనుమతించబడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే ఆ వాహనాన్ని కొత్త స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీతో కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం తాజాగా వ్యక్తిగత వాహనాలకు వేరే రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవసరం లేకుండా కొత్త బీహెఛ్-సిరీస్ అందుబాటులోకి తెచ్చింది. వాహనాల బదిలీని సులభతరం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆగస్టు 26న బీహెఛ్-సిరీస్ పై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాహనం యొక్క యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు బీహెఛ్-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ కలిగి ఉన్న వాహనం కోసం మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nine =