మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Inaugurated Mysuru Dasara Festival at Chamundi Hills Mysuru, President Droupadi Murmu, Mysuru Dasara Festival, Chamundi Hills Mysuru, Droupadi Murmu Started Mysuru Dasara Festival, Mango News, Mango News Telugu, President Droupadi Murmu, Droupadi Murmu Latest News And Updates , Dasara Festival Mysuru, Chamundi Hills Dasara Festival, Mysuru Durga Festival, Mysuru Festival Celberations, Mysuru Dasara Latest News And Updates

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటుగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఏదైనా రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 26, సోమవారం ఉదయం మైసూరు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై ఘన స్వాగతం పలికారు. అనంతరం మైసూరులోని చాముండి హిల్స్‌లో మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చాముండేశ్వరి దీవెనలు దేశ ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

కర్ణాటకలో భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క ఆదర్శాలు స్థాపించబడ్డాయని, కర్ణాటక నుండి భక్తి, సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు మహిళా సాధికారత యొక్క చారిత్రక ఆదర్శాన్ని ప్రదర్శించారన్నారు. మైసూరు దసరా సంప్రదాయాన్ని ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వహించడం దేశ ప్రజలందరికీ గర్వకారణని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఈ సంప్రదాయంలో పాల్గొనాలని ఆహ్వానించిన సీఎం బసవరాజ్ బొమ్మైకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హుబ్లీలో హుబ్లీ-ధార్వాడ్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ నిర్వ‌హించే ‘పౌర సన్మాన’ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. అలాగే ధార్వాడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధార్వాడ్ కొత్త క్యాంపస్‌ను కూడా సోమవారమే రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

ఇక ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 27న బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్‌ల తయారీ సౌకర్యాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా ఆమె జోనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (సౌత్ జోన్)కి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు మరియు బెంగళూరులో ఆమె గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే పౌర రిసెప్షన్‌ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. ఇక సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here