కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని మార్చే ప్రతిపాదన ఏదీ లేదు, స్పష్టం చేసిన ఆర్‌బీఐ

RBI Clarifies That No change in Existing Currency and Banknotes, Reserve Bank of India Clarifies That No change in Existing Currency and Banknotes, Reserve Bank of India Clarifies That No change in replacing the face of Mahatma Gandhi with that of others, face of Mahatma Gandhi with that of others, Reserve Bank of India, RBI Clarifies That No plan to replace Mahatma Gandhi on Indian currency notes, Reserve Bank of India Clarifies That No change in existing Indian currency and banknotes, No change in existing Indian currency and banknotes, Indian currency and banknotes, Indian currency, banknotes, No plan to replace Mahatma Gandhi on Indian currency notes Says Reserve Bank of India, Mahatma Gandhi, RBI, Mango News, Mango News Telugu,

దేశంలో కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలనుకుంటున్నారని, కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్‌ కలాం చిత్రాలను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఆర్‌బీఐ సోమవారం నాడు ఒక ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని మార్చే ప్రతిపాదనేదీ లేదని ఆర్‌బీఐ ప్రకటించింది.

“రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ ముఖాన్ని ఇతరులతో భర్తీ చేయడం ద్వారా ప్రస్తుత కరెన్సీ మరియు బ్యాంకు నోట్లలో మార్పులను పరిశీలిస్తున్నట్లు మీడియాలో కొన్ని విభాగాలలో కథనాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్‌ లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని గమనించాలి” అని ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 10 =