హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్

Andhra Pradesh new districts names list 2022, AP forms 13 new districts, Formation of a New District with The Name NTR, Jagan govt carves out 13 new districts in Andhra, Jagan plans 13 new districts, Mango News, New District with The Name NTR, Tirupati to become Sri Balaji, tollywood director, Tollywood Director YVS Chaudhary, Tollywood Director YVS Chaudhary Welcomes The Formation of a New District with The Name NTR, Vijayawada gets NTR’s name, YVS Chaudhary, YVS Chaudhary Welcomes The Formation of a New District with The Name NTR

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఇకపై రెండు జిల్లాలుగా మారనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లాకు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఒక వీడియో విడుదల చేశారు.

“అందరికి నమస్కారం. పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య పరంగా, పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి అందరికి తెలిసిందే. కాబట్టి హిందూపురం పార్లమెంటును జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ, శ్రీ సత్య సాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం, భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది. జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి. హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాలని, వారి చిరకాల కోరిక అయిన హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here