భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సంచలనం, సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌లో ఘనవిజయం

PV Sindhu Beats Asian Champion Wang Zhi Yi in Finals To Claims Her Maiden Singapore Open Super 500 Title, Super 500 Title, Asian Champion Wang Zhi Yi, Wang Zhi Yi, PV Sindhu Beats Asian Champion Wang Zhi Yi in Finals, PV Sindhu Beats Asian Champion Claims Her Maiden Singapore Open, Maiden Singapore Open, PV Sindhu Wins Finals Of Singapore Open Badminton 2022, India star shuttler PV Sindhu, India star shuttler, PV Sindhu, PV Sindhu Reaches Final, Singapore Open final, Singapore Open Badminton 2022, 2022 Singapore Open Badminton, Singapore Open Badminton, Singapore Open Badminton final Highlights, Singapore Open Badminton 2022 News, Singapore Open Badminton 2022 Latest News, Singapore Open Badminton 2022 Latest Updates, Singapore Open Badminton 2022 Live Updates, Mango News, Mango News Telugu,

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సంచలనం సృష్టించింది. సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో కెరీర్ లో తొలి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. కాగా సింధుకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్‌ కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటికే కొరియన్‌ ఓపెన్‌, స్విస్‌ ఓపెన్‌లను కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న పీవీ సింధు.. ఫైనల్‌లో మ్యాచ్‌ ప్రారంభమైన 12 నిమిషాల్లోనే తొలి రౌండ్ ను ముంగించడం విశేషం.

ఇక తొలి సెట్‌లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చూపించిన సింధు, అనూహ్యంగా రెండో సెట్‌లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో అద్భుతంగా ఆడిన సింధు.. ఈ ఏడాదిలో తొలి సూపర్‌ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ భారత ప్లేయర్‌గా సింధు రికార్డులకెక్కింది. గతంలో సైనా సెహ్వాల్ 2010లో, సాయి ప్రణీత్ 2017లో, సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో పీవీ సింధుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + sixteen =