అయోధ్యలో 144 సెక్షన్ విధింపు

144 Section Imposed In Ayodhya, 144 Section Imposed In Ayodhya Till December 10th, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Section 144 Imposed In Ayodhya, Section 144 Imposed In Ayodhya Till December, Section 144 Imposed In Ayodhya Till December 10th

అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగుస్తాయని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 6వ తేది నుండి విచారణ చేపడుతున్నారు. దసరా సెలవుల అనంతరం తిరిగి సోమవారం నుండి విచారణ ప్రారంభంకానుంది. అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగించి, నవంబర్ 17వ తేదీన తుది తీర్పు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సంవత్సరాలుగా సాగుతున్న అతి సున్నితమైన ఈ కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో అక్టోబర్ 13, ఆదివారం నాడు సెక్షన్‌ 144ని విధించారు. డిసెంబర్‌ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేసారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =