అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్

Telangana CM KCR Presented Chadar to Ajmer Dargah Today,Telangana CM KCR Presented Chadar,Ajmer Dargah,Ajmer Dargah History,Ajmer Dargah Distance,Mango News,Mango News Telugu,Ajmer Dargah Khadim,Ajmer Dargah News,Ajmer Dargah Pin Code,Ajmer Dargah Timings,Ajmer Hotel Near Dargah,Ajmer Ki Dargah,Ajmer Sharif Dargah,Ajmer Sharif Dargah History In Hindi,Ajmer Sharif Dargah Miracle,Ajmer Sharif Dargah Official Website,Ajmer Sharif Dargah Open Today,Ajmer Sharif Dargah Photos,Ajmer Sharif Dargah Timings,Ajmer Sharif Dargah Tour,Ajmer Sharif Ki Dargah,Ajmer Station To Ajmer Dargah Distance,Hotel Near Ajmer Dargah

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను అజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సీఎం కేసీఆర్ వక్ఫ్ బోర్డు అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, సాంఘీక, మైనారిటీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక వైద్యశాఖల మంత్రి హరీశ్ రావు, సాంస్కృతిక పర్యాటక క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనా చారి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులతో పాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ ఛైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ఖాజా మొజీబుద్దీన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ సీనియర్ జర్నలిస్టు ఖాజా ఖయ్యూం అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఖాదీ బోర్డ్ ఛైర్మన్ మౌలానా యూసిఫ్ జాహిద్, ముఫ్తీ- మస్తాన్ వలి, హాఫెజ్ సాబెర్ పాషా ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని, రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ఈ సందర్భంగా వారు ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + thirteen =