తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం

Telangana State BC Commission Team Meets Tamil Nadu CM MK Stalin Today, BC Commission Team Meets Tamil Nadu CM MK Stalin Today, TS State BC Commission Team Meets Tamil Nadu CM MK Stalin Today, Telangana State Backward Classes Chairman and his team members called on Tamil Nadu Chief Minister MK Stalin, Vakulabharanam Krishnamohan Rao, Chairman Vakulabharanam Krishnamohan Rao, Telangana State Backward Classes Chairman, Telangana State Backward Classes Chairman Vakulabharanam Krishnamohan Rao, Telangana State Backward Classes, Backward Classes, Tamil Nadu Chief Minister MK Stalin, Tamil Nadu Chief Minister, MK Stalin, Tamil Nadu CM MK Stalin, Telangana State Backward Classes Commission Team Meets Tamil Nadu CM MK Stalin Today, Telangana State Backward Classes Commission, Backward Classes Commission, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహనరావు నేతృత్వంలో కమీషన్ సభ్యులు సిహెచ్.ఉపేంద్ర, శుభప్రదీపటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్లు శుక్రవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం 10 నిముషాలు కొనసాగగా, తమిళనాడు రాష్ట్రం చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలుతీరు తెన్నుల అధ్యయనం చేయడానికి తమిళనాడుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం ఆయనకు వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ను శాలువాతో సన్మానించి, పలు పుస్తకాలను అందజేశారు. తమిళనాడు పర్యటనలో బీసీ కమిషన్ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్టు తెలిపారు.

గడిచిన 3 రోజులుగా తమిళనాడులో ఉన్న బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం తమిళనాడు బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్.తనికాచలం, బీసీ, ఎంబీసీ, మైనారిటీ శాఖల మంత్రి రాజకన్నప్పన్, ముఖ్యకార్యదర్శి కార్తిక్ ఐఏఎస్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అముద ఐఏఎస్, మరియు ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై అనేక అంశాలపై ఆరాతీశారు. ఈ సమావేశాలన్ని అధ్యయనం కొనసాగింపులో భాగంగా నిర్వహించారు. శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలితో సమావేశమైన వకుళాభరణం నేతృత్వంలో బృందం తాము చేయబోయే అధ్యయన వివరాలు కూడా ఆయన దృష్టికి తెచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో పరిమాణాత్మకంగా (క్వాంటిఫయబుల్ డేటా), రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్దతులను ఇక్కడి అధికారులతో సమగ్రంగా సేకరిస్తున్నట్లు స్టాలిన్ కు వివరించారు. అలాగే స్థానిక ఇ.వి.కే.సంపత్ రోడ్ లో ఉన్న ద్రావిడ ఉద్యమ దిగ్గజం, ప్రముఖ సంఘ సంస్కర్త ఇ.వి.పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని కూడా శుక్రవారం నాడు బీసీ కమిషన్ బృందం సందర్శించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =