హైదరాబాద్‌ లోని పబ్బులు, రెస్టారెంట్లపై ఆంక్షలు, ఇకపై రాత్రి 11 తర్వాత నో ఆర్డర్స్ – సీపీ సీవీ ఆనంద్

Hyderabad CP CV Anand Warns Don't Take Orders After 11 PM For Pubs and Restaurant Owners, CP CV Anand Warns Don't Take Orders After 11 PM For Pubs and Restaurant Owners, Don't Take Orders After 11 PM For Pubs and Restaurant Owners, Hyderabad CP CV Anand, Hyderabad City Police Commissioner CV Anand held a meeting with the more than 100 owners of pubs And bars & restaurants, meeting with the more than 100 owners of pubs And bars & restaurants, pubs, bars, restaurants, Hyderabad City Police Commissioner CV Anand, Hyderabad City Police Commissioner, City Police Commissioner CV Anand, CV Anand, Don't Take Orders After 11 PM, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌ లోని పబ్బులు, రెస్టారెంట్లుపై పొలిసు శాఖ కొత్తగా ఆంక్షలు విధించింది. ఇకపై నగరంలోని పబ్బులు, రెస్టారెంట్లలో రాత్రి 11 గంటల తర్వాత ఆర్దర్లు తీసుకోరాదని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ నగర నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ ప్రకటించారు. డ్రగ్స్‌ వినియోగం, ధ్వని కాలుష్యం, ఇతర ఫిర్యాదులపై కాన్ఫరెన్స్‌ హాల్‌లో 100 మందికి పైగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ల యజమానులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల పుడ్డింగ్ మింక్ పబ్ ప్రాంగణంలో కొకైన్ కనుగొనబడిన నేపథ్యంలో డ్రగ్స్, గంజాయి, హాష్‌ ఆయిల్‌ వంటి నిషేధిత పదార్ధాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, చిన్నపాటి లాభాల కోసం రాష్ట్రానికి చెడ్డపేరు తేవొద్దని హెచ్చరించారు.

అలాగే పబ్బుల్లో ఇక నుంచి 30 రోజుల బ్యాకప్‌తో సీసీ ఫుటేజ్ ఉండాలని, రాత్రి 11 తర్వాత ఎలాంటి ఆర్డర్లను అంగీకరించవద్దని సూచించారు. రాత్రి 12 లోపే పబ్బులు మూసివేయాలని.. శుక్ర, శని వారాల్లో గ్రేస్‌ పిరియడ్‌తో పాటు అదనంగా మరో గంట సమయం కేటాయిస్తామని తెలిపారు. మద్యం అమ్మకాలకు స్టార్‌ హోటళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని, అది కూడా అంతర్జాతీయ ప్రయాణికులు, ఫారెన్ డెలిగేట్స్ కోసం అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రోడ్లపై వాహనాలు నిలపకుండా చూడాలని, అర్ధరాత్రి వరకు ఓవర్ సౌండ్‌తో డీజేలు వంటివి ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fifteen =