అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి

Agri Innovation, Agri Innovation Hub, Agri Innovation Hub at Hyderabad, Agri Innovation Hub Inauguration, Agri Innovation Hub Inauguration News, Agriculture Minister Singireddy Niranjan Reddy, Hyderabad, Inauguration of Aghub, KTR Niranjan Reddy Sabitha Indra Reddy Inaugurated Agri Innovation Hub, Mango News, Minister KTR, Ministers KTR Niranjan Reddy Sabitha Indra Reddy Inaugurated Agri Innovation Hub at Hyderabad, Niranjan Reddy, Sabitha Indra Reddy

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటైన ఏజిహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ ను ఆగస్ట్ 30, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు, ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్రిహబ్ ను రూ.9 కోట్ల నాబార్డ్‌ ఆర్ధిక సాయంతో నిర్మించారు.

వ్యవసాయరంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్స్ ను ప్రోత్సహించేందుకు ఇటువంటి హబ్ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు తెలిపారు. ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్స్ ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ఈ అగ్రిహబ్ హైదరబాద్ కేంద్రంగా పనిచేయనుందని, జగిత్యాల, వరంగల్, వికారాబాద్ లోనూ గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువయ్యేందుకు, వారి ఆలోచనలకు రూపం కల్పించేందుకు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గ్రామీణ యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల్లో అగ్రి బిజినెస్ మెళకువలు నేర్పించేందుకు ఈ హబ్ తోడ్పాటు అందించనుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =