మరోసారి సెల్ఫ్ ఐసొలేషన్ లోకి యూకే ప్రధాని

Boris Johnson, Boris Johnson self-isolating after MP tests positive, British PM Boris Johnson self-isolating, British Prime Minister Boris Johnson, Mango News Telugu, UK PM Boris Johnson, UK PM Boris Johnson Self-isolating, UK Prime Minister Boris Johnson

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్ మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తిని కలవడంతో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ టెస్ట్ అండ్ ట్రేస్ స్కీం నిబంధనలకు అనుగుణంగా రెండువారాల పాటుగా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండనున్నట్టు తెలిపారు. తాను మంచి ఆరోగ్యంతో ఉన్నానని మరియు కరోనా లక్షణాలు లేవని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ కరోనా మహమ్మారి రెస్పాన్స్ టీమ్ కు ఇంటివద్ద నుంచే నాయకత్వం వహిస్తానని తెలిపారు. మరోవైపు గత ఏప్రిల్ లో బోరిస్‌ జాన్సన్‌ కు కరోనా వైరస్ సోకడంతో ముందుగా స్వీయ నిర్భందంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనల మేరకు కొన్నిరోజుల పాటు ఐసీయూలో కూడా చికిత్స పొందారు. అనంతరం కరోనా నుంచి కోలుకుని విధులకు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =