భారతదేశపు మొట్టమొదటి సీఎన్‌జీ ట్రాక్టర్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Union Minister Nitin Gadkari Unveiled India's first CNG Tractor Today,Mango News,Mango News Telugu,Nitin Gadkari Introduces India's First Retrofitted CNG Tractor,India’s first CNG tractor unveiled Govt claims annual saving of ₹1 lakh on fuel costs Gadkari unveils India’s first CNG tractor,Nitin Gadkari Unveils India's First-ever Economical And Environment-friendly CNG Tractor,India's first CNG tractor introduced Nitin Gadkari claims savings up to Rs 1.5 lakh annually,India's First Retrofitted CNG Tractor Launched by Union Minister Nitin Gadkari,India's First Retrofitted CNG Tractor Launched by Union Minister Nitin Gadkari,Nitin Gadkari inaugurates India's first CNG tractor which aims to benefit farmers

భారతదేశపు మొట్టమొదటి సీఎన్‌జీ ట్రాక్టర్‌ ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. డీజిల్‌ ట్రాక్టర్‌ లో మార్పులు చేసి కొత్తగా సీఎన్‌జీ ట్రాక్టర్‌ గా అందుబాటులోకి తెచ్చారు. రామాట్ టెక్నో సొల్యూషన్స్ మరియు తోమాసెట్టో అచిల్లె ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ సీఎన్‌జీ ట్రాక్టర్‌ ను రూపొందించాయి. ఈ రోజు ఆవిష్కరించిన సీఎన్‌జీ ట్రాక్టర్‌ ను కేంద్ర మంత్రి గడ్కరీ సొంతం చేసుకున్నారు.

ఈ సీఎన్‌జీ ట్రాక్టర్లు రైతులకు ఇంధన వ్యయంపై సంవత్సరానికి రూ.లక్ష రూపాయలు ఆదా చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత డీజిల్ ధర లీటర్ కు రూ.77.43 ఉండగా, సీఎన్‌జీ ధర కిలోకు రూ.42 మాత్రమే ఉన్నందున రైతులకు ఇంధన వ్యయంపై 50% వరకు ఆదా అవుతుందని తెలిపారు. రైతులకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచడంతో పాటుగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ఈ మార్పు దోహదపడనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, పార్శోత్తం రూపాలా, వీకే సింగ్‌ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =