ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ విమానం.. ఎప్పుడు ? ఎక్కడ?

Worlds First All Electric Airplane Manufactured by Eco Jet Will Fly From Southampton to Edinburgh,Worlds First All Electric Airplane,All Electric Airplane Manufactured by Eco Jet,Eco Jet Will Fly From Southampton,Eco Jet From Southampton to Edinburgh,Mango News,Mango News Telugu,electric plane,Ecojet Company,Dale Vince,Just Stop Oil, The world's first electric plane,Worlds First Electric Flight Services,UKs First Electric Airline Launches,Dale Vince launches an aviation revolution,British Entrepreneur Set to Launch Ecojet,UKs 1st Electric Airline Ecojet,Electric Airplane Latest News,Electric Airplane Latest Updates

బైక్, ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ బస్ అయిపోయాయి ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లైట్ వంతు వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమాన సేవలు.. మరో రెండేళ్లలో ప్రారంభం కానున్నాయట. తొలి విడతలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ నుంచి ఎడిన్‌బర్గ్‌ వరకు.. ఈ విమానాలు ప్రయాణించేలా సిద్ధం చేస్తున్నారు .

ఈ విమానాల్లోని హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ ద్వారా.. ఎలక్ట్రసిటీ రిలీజవుతుంది. ఈ ఎలక్ట్రసిటీతోనే విమానాలు నిరాటంకంగా రాకపోకలు సాగించగలుగుతాయి. అయితే ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. తాము పాత ఎయిరోప్లేన్స్‌కు రిపేర్లు చేసి, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ను అమర్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని ఎకోజెట్‌ అధికారులు వెల్లడించారు.

ఈ ఎలక్ట్రిక్ ఎయిరోప్లేన్స్‌ వల్ల ఎన్విరాన్‌మెంట్‌లోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం.. సంవత్సరానికి 90వేల టన్నుల వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. పొల్యూషన్‌కు దారితీసే పెట్రో ఇంధనాల వాడుకను పూర్తిగా ఆపివేయాలనే లక్ష్యంతోనే.. పూర్తి ఎలక్ట్రిక్ విమాన సేవలను ప్రారంభించేందుకు ‘ఎకోజెట్‌’ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. బ్రిటిష్‌ సంపన్నుడయిన డేల్‌ విన్స్‌.. ఎకోజెట్ కంపెనీని నెలకొల్పారు.

జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌ వంటి ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్‌కు విరాళాలు అందించే అలవాటున్న డేల్‌ విన్స్, కర్బన ఉద్గారాలను విడుదల చేయని విమాన సర్వీసులను అందించడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఈ విమాన సర్వీసులు సౌతాంప్టన్‌ నుంచి ఎడిన్‌బర్గ్‌ల మధ్య 2025 నుంచి ప్రారంభం కానున్నాయని విన్స్‌ అనౌన్స్ చేశారు.

‘ఎకోజెట్‌’ 2 రకాల విమానాల ద్వారా ఈ సర్వీసులను అందించనుంది. ఒకటో రకం.. పంతొమ్మిది సీట్ల సామర్థ్యం గల విమానాలు.. రెండో రకం.. డెబ్బయి సీట్ల సామర్థ్యం గల విమానాలు ఈ సర్వీసుల కోసం ‘ఎకోజెట్‌’వెహికల్స్ లిస్టులోకి యాడ్ అవబోతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + nine =