2021 నోబెల్‌ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్‌ నామినేట్‌

Donald Trump, Donald Trump Nominated for Nobel Peace Prize-2021, Donald Trump Nominated for Nobel Prize, Nobel Peace Prize 2021, nobel peace prize 2021 nominees, Nobel Prize nominees, US President, US President Donald Trump, US President Trump nominated for 2021 Nobel Peace Prize

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2021 నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడుగా ఎన్నికైన క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే ట్రంప్ ను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు ట్రంప్ ను నామినేట్ చేసినట్టు ఆయన తెలిపారు. నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్ అయిన ఇతరుల కంటే, ట్రంప్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఎక్కువ కృషి చేశాడని భావిస్తున్నానని టైబ్రింగ్ జెజెడ్డే పేర్కొన్నారు. వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ పేరు నామినేట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here