గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం, రేపట్నుంచి మే 3 వరకు లాక్‌డౌన్ అమలు

Goa announces lockdown, Goa announces lockdown till Monday morning, Goa government announces lockdown, Goa Govt Announced Lockdown, Goa Govt Announced Lockdown in State from 29th April 7 PM to the Morning of May 3rd, Goa govt announces 4-day strict lockdown, Goa govt announces lockdown till Monday, Goa Lockdown News, Lockdown in Goa, Lockdown in Goa from tomorrow, Mango News

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29, గురువారం రాత్రి 7 గంటల నుండి మే 3 ఉదయం వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం నాడు ప్రకటించారు. కేవలం అవసరమైన సేవలు మరియు పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా రవాణా, క్యాసినోలు, హోటళ్ళు, పబ్బులు మూసివేయబడతాయని అన్నారు. ఇక అత్యవసర వస్తువుల రవాణా నిమిత్తం సరిహద్దులు తెరచే ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు గోవాలో ఇప్పటివరకు మొత్తం 81,908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 64,231 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,086 మంది మరణించారు. ప్రస్తుతం 716,591 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fourteen =