కిసాన్ రైలును ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రులు

AP CM YS Jagan, AP CM YS Jagan and Union Ministers Flagged off Kisan Train, kisan rail, kisan rail anantapur, kisan rail andhra pradesh, Kisan Rail From Anantapur to Delhi, kisan rail route, kisan rail scheme, kisan rail service, Kisan Rail Special, kisan rail to ap, Kisan Rail to transport fruits, kisan rail yojana, Kisan Train from Anantapur to Delhi

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నుంచి ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తుల రవాణా కోసం రాకపోకలు సాగించే కిసాన్ రైలును ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ సి.అంగడి వర్చువల్ విధానం‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో అనంతపురం రైల్వే స్టేషన్ ‌నుంచి కిసాన్ రైలు ఢిల్లీకి బయలుదేరింది. ఈ మార్గంలో అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో కిసాన్‌ రైలు రాకపోకలు సాగించనుంది.

దేశంలో రైతులు పండించే పళ్ళు, కూరగాయల, ఇతర ఉత్పతుల రవాణాకు రోడ్డుమార్గంతో పోల్చుకుంటే సమయం, ఖర్చు ఆదా అయ్యేలా రైల్వే శాఖ వినూత్నంగా కిసాన్ రైల్ సేవలను ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర నుంచి బీహార్ కు దేశంలోనే తొలి కిసాన్ రైలును ఆగస్టు లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 8 =