పాత వాహనాలకు కూడా జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ త‌ప్ప‌నిస‌రి‌: కేంద్రం

4 Wheel Vehicles Required to have Fastags, All 4 Wheel Vehicles Required to have Fastags, Fastags, FASTags mandatory for all four wheelers, FASTags to be for all four wheelers, FASTags to be mandatory for all four wheelers, MoRTH issues notification for Promotion

దేశంలో టోల్​గేట్ల వద్ద ట్రాఫిక్​ను ​నియంత్రించడంతో పాటుగా, డిజిట‌ల్‌, ఐటి ఆధారిత చెల్లింపుల‌ను ప్రోత్స‌హించే లక్ష్యంతో 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ విధానాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు 4 చక్రాల పాత వాహనాలకు కూడా ఫాస్టాగ్‌ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా జ‌న‌వ‌రి 1, 2021 నుంచి అన్ని 4 చ‌క్రాల వాహ‌నాల‌కు ఫాస్టాగ్‌లు త‌ప్ప‌నిస‌రి‌ చేస్తూ కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ శ‌నివారం నాడు నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ​ ఉత్తర్వులు ఇచ్చారు.

కేంద్రం నిర్ణయంతో డిసెంబర్ 1, 2017 కంటే ముందు కొనుగోలు చేసిన నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఫాస్టాగ్ నిబంధన వర్తించనుంది. మరోవైపు ర‌వాణా వాహ‌నాలకు ఫాస్టాగ్ ఫిట్‌మెంట్ చేసిన త‌ర్వాత‌నే ఫిట‌నెస్ స‌ర్టిఫికెట్ ను రెన్యువ‌ల్ చేసేలా త‌ప్ప‌నిస‌రి నిబంధన పెట్టారు. అలాగే ఫార్మ్ 51 (ఇన్సూరెన్స్ స‌ర్టిఫికెట్‌) స‌వ‌ర‌ణ ద్వారా 3వ పార్టీ బీమాను పొందే స‌మ‌యంలో కూడా వాహనాలకు ప్రామాణిక‌మైన ఫాస్టాగ్ ఉండటం త‌ప్ప‌నిస‌రి అని, ఇది ఏప్రిల్‌ 1, 2021 నుంచి అమలులోకి వస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − five =