ముంబయి మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ముంబయి 1 మొబైల్ యాప్ లాంఛ్

PM Modi Takes Metro Ride from Gundavali Metro Station to Mogra in Mumbai Launched MUMBAI 1 Mobile App NCMC Card,PM Modi Takes Metro Ride,Gundavali Metro Station to Mogra in Mumbai, Launched MUMBAI 1 Mobile App, NCMC Card,Mango News,Mango News Telugu,Mumbai Metro Ticket,Jobs In Mumbai Metro Rail Project,Mumbai Metro 2A,Mumbai Metro 3,Mumbai Metro 7,Mumbai Metro Map,Mumbai Metro New Line,Mumbai Metro Rail Corporation,Mumbai Metro Rail Corporation (Mmrc),Mumbai Metro Rail Map,Mumbai Metro Rail Network,Mumbai Metro Rail News,Mumbai Metro Rail Project Contractors,Mumbai Metro Rail Recruitment 2023,Mumbai Metro Rail Route Map,Mumbai Metro Railway Map,Mumbai Metro Railway Recruitment 2021,Mumbai Metro Route,Mumbai Metro Stations,Mumbai Metro The Metro Rail Guy,Navi Mumbai Metro,Navi Mumbai Metro Rail,Navi Mumbai Metro Rail Corporation,Navi Mumbai Metro Rail Latest News,Navi Mumbai Metro Rail Route Map

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలో సుమారు రూ.12,600 కోట్లతో నిర్మించిన ముంబయిలోని 2ఏ (18.6 కి.మీ పొడవు) మరియు 7 (16.5 కి.మీ పొడవు) మెట్రో రైల్ లైన్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మెట్రో లైన్లకు 2015లో ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. అనంతరం ప్ర‌ధాని మోదీ ముంబయి మెట్రో రైలులో ప్రయాణించారు. ముంబయిలోని గుండావ‌లి మెట్రో స్టేష‌న్ నుండి మోగ్రా స్టేషన్ వ‌ర‌కు ప్రధాని ప్రయాణించారు. ఈ మెట్రో ప్రయాణం సందర్భంగా పలువురు విద్యార్థులు, యువతి యువకులు, మెట్రో నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులు, రోజువారీ ప్రయాణికులుతో ప్రధాని సంభాషించారు.

అలాగే మెట్రో ప్రయాణంలో ప్రధానితో పాటుగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోహ్స్యరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముంబయి 1 మొబైల్ యాప్ మరియు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ముంబయి 1)ని కూడా ప్రారంభించారు మరియు మెట్రో ఫొటో ఎగ్జిబిషన్‌, త్రీడీ మోడల్‌ ను పరిశీలించారు. ముంబయి 1 మొబైల్ యాప్ ప్రయాణ సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని, మెట్రో స్టేషన్‌ల ప్రవేశ ద్వారాలపై చూపబడుతుందని మరియు యూపీఐ ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి డిజిటల్ చెల్లింపుకు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇక నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ముంబయి 1) ముందుగా మెట్రో కారిడార్‌లలో ఉపయోగించబడుతుందని మరియు స్థానిక రైళ్లు మరియు బస్సులతో సహా ఇతర సామూహిక ప్రజా రవాణా మార్గాలకు కూడా విస్తరించబడే అవకాశం ఉందన్నారు. ఎన్సీఎంసీ కార్డ్ త్వరిత, కాంటాక్ట్ లెస్, డిజిటల్ లావాదేవీలను అందిస్తుందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + ten =